spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhanda: మూడో వారంలోనూ 'అఖండ' ప్రభంజనమే !

Akhanda: మూడో వారంలోనూ ‘అఖండ’ ప్రభంజనమే !

Akhanda: బాలయ్య బాబు ‘అఖండ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. విడుదలై ’17’ రోజులు పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికి అఖండ ఇంకా డీసెంట్ కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధిస్తోంది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన మరియు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.

Akhanda
Akhanda

అసలు గత పదేళ్లలో ఒక సినిమా రిలీజ్ అయిన మూడో వారంలో కూడా తన ప్రభావం చూపించగలుగుతుంది అంటే.. బహుశా అది అఖండ ఒక్కటే అనుకుంటా. నేటికీ రిలీజ్ అయిన 17వ రోజు కూడా ఈ సినిమా కి పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ వస్తుండటం నిజంగా విశేషమే. మరి అఖండ మొత్తం 16 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే..

నైజాం 18.40 కోట్లు
సీడెడ్ 13.83 కోట్లు
ఉత్తరాంధ్ర 5.76 కోట్లు
ఈస్ట్ 3.73 కోట్లు
వెస్ట్ 3.14 కోట్లు
గుంటూరు 4.33 కోట్లు
కృష్ణా 3.31 కోట్లు
నెల్లూరు 2.37 కోట్లు

ఏపీ మరియు తెలంగాణలో ఇప్పటి వరకు అఖండకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం 54.87 కోట్లు.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 9.81 కోట్లు

వరల్డ్ వైడ్ గా అఖండకు వచ్చిన కలెక్షన్స్ మొత్తం 64.68 కోట్లు.

‘అఖండ’ సినిమానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.10.88 కోట్ల లాభాలు వచ్చినట్టే. ఇక ఎలాగూ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి. ఈ రైట్స్ అన్నీ కలుపుకుంటే మరో 36 కోట్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ‘ద్వారకా క్రియేషన్స్‌’ మిర్యాల రవిందర్ రెడ్డికి భారీ లాభాలు వచ్చినట్టే.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version