Balayya: బాలయ్య బాబు అఖండ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధిస్తోంది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన మరియు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా $800K కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
అఖండకు ఇప్పుడున్న ఊపు చూస్తుంటే.. చాలా ఈజీగా 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాలయ్య యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నాడు. యూఎస్ లోనూ అఖండ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందనడానికి ఈ కలెక్షన్లే నిదర్శనం. పైగా 2021లో ఒక తెలుగు సినిమాకి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి.
వచ్చే వీకెండ్ లో కూడా ఇదే జోరు కొనసాగేలా ఉంది. మొత్తానికి నటసింహం బాలకృష్ణ అఖండ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంక్రాంతి ముందే జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం కనిపిస్తుంది. మొదటి షో నుండే అఖండ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి.
పైగా బాలయ్య థియేటర్స్ లో అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. బాలయ్య సెకెండ్ లుక్ రాగానే థియేటర్స్ నిండా ఈలలు, గోలలే.. ఆ మాస్ అరుపులకు, కేకలకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు కుర్చీలలో నిలబడట్లేదు.
Also Read: Sirivennela: పద్మ శ్రీ సిరివెన్నెల ఒక పాటకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే?
ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం అఖండ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు యూఎస్ కలెక్షన్స్ ను కలుపుకొని వంద కోట్లు దాటుతుందని అంచనా ఉంది. పైగా ఈ మూవీ ప్రీమియర్ వసూళ్ళలో వకీల్ సాబ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న ఈ హ్యాట్రిక్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
Also Read: Tollywood Actors: తెలుగు హీరోలను జస్టిస్ ఎన్వీ రమణ అంత మాటన్నాడా..?