Good Luck Sakhi: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి, ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధం అయ్యింది. కరోనా దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడినట్టే… ఈ సినిమా కూడా వాయిదా పడింది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత… నెమ్మదిగా సినిమాలు థియేటర్లలోకి రావడం ప్రారంభించాయి.
Also Read: Balayya: అక్కడ కూడా రికార్డుల మోత మోగిస్తోన్న బాలయ్య !
దాంతో ‘గుడ్ లక్ సఖి’ని నవంబర్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా… డిసెంబర్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు నిర్మాత సుధీర్ చంద్ర వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అనుకోని కారణాల రీత్యా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించారు. తాజాగా డిసెంబర్ 31న సినిమాను విడుదల చేయనున్నట్టు సహ నిర్మాత శ్రావ్యా వర్మ ట్వీట్ చేశారు. “సినిమాను మీ (ప్రేక్షకుల) ముందుకు తీసుకు రావడానికి మేం చాలా కష్టపడుతున్నాం. కానీ, అనుకోని సమస్యల కారణంగా విడుదలను డిసెంబర్ 31కి వాయిదా వేశాం. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి” అని ఆమె పేర్కొన్నారు.‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Engineering: ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు వీళ్లే..!
https://twitter.com/shravyavarma/status/1467455950097317890?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1467455950097317890%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fkeerthy-suresh-s-good-luck-sakhi-movie-release-postponed-again-here-is-the-new-release-date-12855