Akhanda Collections: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది. మొత్తమ్మీద బాలయ్య అఘోరాగా కనిపించి, అభిమానులను ఎంతగానో అలరించాడు. కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ. 50 రోజులు నిర్విరామంగా ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఈ రోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ఈ మూవీ ఇప్పుడు మరో 4 భాషల్లోకి డబ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళ డబ్బింగ్ హక్కులు అమ్ముడుపోయాయి. మరోవైపు మలయాళం, కన్నడతో పాటు హిందీలోనూ బాలయ్యబాబు ‘అఖండ’ సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తన మేనియా చూపిన బాలయ్య, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో దుమ్ము రేపబోతున్నాడు. ఏది ఏమైనా తమిళంలో బాలయ్య ‘అఖండ’ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. తెలుగు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన అఖండ బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ పై దాడికి దిగిన జగన్ మీడియా
సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు కలెక్ట్ చేసింది. కోటి కలెక్షన్స్ అంటే ఇది మాములు రికార్డ్ కాదు. ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గొప్ప విషయం. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

అన్నట్టు థియేటర్స్ కే ఈ సినిమా పరిమితం కాలేదు. ఓటీటీలోనూ కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది. అన్నట్టు జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలై. 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించింది.
Also Read: తెలుగు స్టార్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్… టాప్ లో నాగార్జున!