Akhanda 2 Worldwide Closing Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna ) ‘అఖండ 2′(Akhanda 2 Movie). బోయపాటి శ్రీను తో బాలయ్య చేసిన నాల్గవ చిత్రమిది . అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడం తో ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగా ఉండేవి. కానీ మధ్యలో ప్రమోషనల్ కంటెంట్ అనుకున్నంత రేంజ్ లో లేకపోవడం వల్ల అంచనాలు తగ్గాయి. కానీ ఎప్పుడైతే ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిందో, అప్పుడు ఈ సినిమా గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. తద్వారా హైప్ కూడా ఏర్పడింది. అలా మంచి హైప్ తో విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫలితంగా డిజాస్టర్ ఫ్లాప్ గానే మిగిలింది. కానీ ఓపెనింగ్స్ వరకు పర్వాలేదు అనిపించుకుంది.
దాదాపుగా థియేట్రికల్ రన్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, క్లోజింగ్ లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఈ సినిమా నైజాం ప్రాంతంలో చాలా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసింది అని చెప్పొచ్చు. 20 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, 19 కోట్ల 23 లక్షల షేర్ వసూళ్లు క్లోజింగ్ లో వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో మాత్రం ఈ చిత్రం ఘోరమైన నష్టాలను చవి చూసింది. పాతిక కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, క్లోజింగ్ లో కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో 5 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్ల 36 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 38 లక్షలు, గుంటూరు జిల్లాలో 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కృష్ణ జిల్లాలో 3 కోట్ల 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, నెల్లూరు జిల్లాలో 2 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు 56 కోట్ల 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి 6 కోట్ల 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 68 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూలు, 118 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.