Akhanda 2 fake bookings: అనేక ఇబ్బందులను ఎదురుకొని ఎట్టకేలకు నిన్న థియేటర్స్ లో ప్రీమియర్స్ షోస్ తో విడుదలైన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం, అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. మొదటి నుండి ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉండేవి. కానీ ప్రమోషనల్ కంటెంట్ అనుకున్నంత రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో జనరల్ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా వాయిదా పడిందో, అప్పుడే ఈ చిత్రం గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. నందమూరి ఫ్యాన్స్ లో కసి కూడా బాగా పెరిగింది. ప్రీమియర్ షోస్ కి మంచి కలెక్షన్స్ ని అందించారు. నైజాం ప్రాంతం లో ప్రీమియర్ షోస్ నుండి 2 కోట్ల 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 60 లక్షలు, ఆంధ్ర నుండి కోటి 78 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 6 కోట్ల 86 లక్షల రూపాయిల వరకు వచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ చిత్రానికి నేడు మార్నింగ్ షోస్ నుండి కలెక్షన్స్ అన్ని ప్రాంతాల్లోనూ బాగా డ్రాప్ అయ్యింది. నందమూరి అడ్డా అని చెప్పుకొని తిరిగే అనేక ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ నమోదు అవ్వలేదు. వైజాగ్ లాంటి సిటీ లో ఈ చిత్రానికి కేవలం రెండు హౌస్ ఫుల్ షోస్ నమోదు అయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అనేది. అయితే ఇంతలా కలెక్షన్స్ డ్రాప్ అయ్యినప్పటికీ కూడా, బుక్ మై షో యాప్ లో గంటకు 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నట్టు గా కనిపించింది. కలెక్షన్స్ ఏమో ప్రతీ షో కి తగ్గిపోతున్నాయి, కానీ ఇక్కడేమో టికెట్స్ ఈ రేంజ్ లో సేల్ అవుతున్నాయి, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అని విశ్లేషకులు సైతం ఆలోచనలో పడ్డారు.
అయితే కాసేపటికి 20 వేల టిక్కెట్ల అమ్మకం నుండి గంటకు రెండు వేల టికెట్స్ కి పడిపోవడం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. మొదటి రోజు ఈ రేంజ్ లో డ్రాప్ అయ్యింది ఏంటి?, అంటే ఇంతకు ముందు గంటకు 20 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నట్టు చూపించింది ఫేక్ నా?, పోనీ బుక్ మై షో యాప్ లో ఏదైనా బగ్ ఏర్పడిందా?, అందుకే ఇలా చూపిస్తుందా ? అని అనుకున్నారు. కానీ మిగిలిన సినిమాలకు సరిగ్గానే ఉన్నాయి, కేవలం ఒక్క అఖండ విషయం లో మాత్రమే తేడా కొట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇది ఆ మూవీ టీం చేస్తున్న జిమ్మిక్కులు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Asalaentra idi BookMyShow bug ankunna vere movies baane unnai ga pic.twitter.com/4G52W8glvp
— – (@OnlyFrPSPK) December 12, 2025