Akhanda 2 Tandavam Promo Song: నందమూరి అభిమానులు మొత్తం ఇప్పుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నందమూరి క్యాంప్ నుండి స్టార్ హీరోగా పరిగణింపబడే ఎన్టీఆర్ నుండి ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశం లేదు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న చిత్రం పూర్తి అయ్యి థియేటర్స్ లోకి వచ్చేలోపు కనీసం రెండేళ్లు అవుతుంది. వచ్చే ఏడాది జూన్ లో విడుదల చేస్తారని అంటున్నారు కానీ, అంత తొందరగా పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే నందమూరి ఫ్యాన్స్ తన ఎనర్జీ మొత్తాన్ని ‘అఖండ 2 ‘ కోసం దాచుకున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన రెండు టీజర్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం తో, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని బలంగా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
కానీ నిన్న విడుదల చేసిన ‘అఖండ తాండవం’ ప్రోమో సాంగ్ ని చూసి అభిమానులు భయపడినంత పని అయ్యింది. ట్యూన్ బాగున్నప్పటికే బోయపాటి బాలయ్య బాబు ని చూపించే విధానం చాలా కామెడీ గా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా VFX వర్క్ కూడా చాలా చీప్ గా ఉందని, పని పూర్తి కాకుండా ఈ చిత్రం నుండి కంటెంట్ విడుదల చేయడం ఎందుకు?, అనవసరంగా సినిమా పై ఆడియన్స్ లో నెగిటివ్ అభిప్రాయం కలుగుతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య గెటప్, అదే విధంగా ఆయన పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ ని చూసి బోయపాటి కి పైత్యం ముదిరింది, ఈసారి పెద్ద ఫ్లాప్ ని ఎదురుకుంటాడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే నార్త్ అమెరికా లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు.
సినీ మార్క్ మెయిన్ థియేటర్స్ అన్నిట్లో షోస్ ని షెడ్యూల్ చేశారు. సుమారుగా 350 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా, వాటి నుండి కేవలం 27 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే సినీ మార్క్ మెయిన్ లొకేషన్స్ అన్నిట్లో బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఒక సినిమాకు మంచి క్రేజ్ ఉంటే ఈ షోస్ నుండి కనీసం లక్ష డాలర్లు ఈపాటికి వచ్చి ఉండాలి. ఓజీ, పుష్ప 2 , దేవర చిత్రాలకు ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ‘అఖండ 2’ సీక్వెల్ కదా, కచ్చితంగా పైన చెప్పిన సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి కూడా బుకింగ్స్ జరుగుతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ 1 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా ప్రీమియర్స్ నుండి ఈ చిత్రం రాబట్టేలాగా కనిపించడం లేదు.
