Akhanda 2 Movie : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ వణుకుతాది, అలాంటిది ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్(Akhanda 2 Movie) తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమాని ముందుగా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ అప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అయ్యే అవకాశం లేనందున ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. షూటింగ్స్ సెట్స్ లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తి అయ్యాయి. బాలయ్య కెరీర్ లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
Also Read : దిక్కు తోచని స్థితిలో డైరెక్టర్ క్రిష్..అనుష్క ‘ఘాటి’ నుండి తప్పుకున్నాడా?
ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్, సీనియర్ నటి విజయశాంతి(Vijayashanti) నటించబోతుందని టాక్. రీసెంట్ గానే ఆమెని కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీ ని వివరించి, ఆమె పాత్ర లో బలం గురించి కూడా క్లుప్తంగా వివరించి చెప్పాడట. బోయపాటి న్యారేషన్ కి ఎంతో సంతృప్తి చెందిన విజయశాంతి ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతం లో బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ ఒక సెన్సేషన్. వీళ్ళ కలయిక లో దాదాపుగా 25 సినిమాలు వచ్చాయి. అందులో అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలే. అలాంటి కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్లకు రిపీట్ అవ్వబోతుండడం మూవీ లవర్స్ కి నిజంగా పండగే అని చెప్పొచ్చు. విజయశాంతి పాత్ర ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మరింత మైలేజ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హీరో హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తేనే వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అంటూ రూమర్స్ పుట్టిస్తారు. అలాంటిది వీళ్లిద్దరు కలిసి పాతిక సినిమాలు చేసారు, వీళ్ళ మీద ఎన్ని రూమర్స్ వచ్చి ఉంటాయో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా ఆది పిన్ని శెట్టి నటిస్తున్నాడు. అఖండ చిత్రానికి కొనసాగింపుగానే ‘అఖండ 2 ‘ ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట. ‘అఖండ’ చిత్రం కేవలం తెలుగు లో మాత్రమే విడుదలైంది, కానీ ‘అఖండ 2 ‘ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రం తో బాలయ్య ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతాడని అంటున్నారు అభిమానులు.
Also Read : ప్రవస్తి సంచలన ఆరోపణలపై సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్..వీడియో వైరల్!