Akhanda 2 Two Days Collections: నందమూరి బాలకృష్ణ(|Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోస్ లో అభిమానులు ఈ సినిమాని చూసి సంతృప్తి చెందారు కానీ, జనరల్ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఇష్టపడలేదు. హద్దులు దాటినా డైలాగ్స్, మితిమీరిన ఫైట్స్ చూసే ఆడియన్స్ కి చిరాకు కలిగింది. ఫలితంగా ఈ చిత్రం డిజాస్టర్ వైపు దూసుకెళ్తుంది. ‘అఖండ’ చిత్రం లో మాస్ సన్నివేశాలు, ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. రెండు పర్ఫెక్ట్ గా కుదరడం తో ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య కి సరికొత్త సినీ కెరీర్ ని అందించింది. అందుకే ‘అఖండ 2’ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి.
ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ సన్నివేశాలు పెట్టారు కానీ, ఎందుకో అవి వర్కౌట్ అవ్వలేదు . ఇకపోతే ఈ సినిమాకు రెండవ రోజు వసూళ్లు అన్ని ప్రాంతాల్లో భారీ గా డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో అయితే కనీస స్థాయి ఆక్యుపెన్సీలను కూడా ఈ చిత్రం నూన్ షోస్ నుండి నమోదు చేసుకోలేకపోయింది. బాలయ్య కి కంచుకోట గా పిలవబడే సీడెడ్ లో కూడా అదే పరిస్థితి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా అంతంత మాత్రంగానే వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం హైదరాబాద్ లోనే కొన్ని నేషనల్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది కానీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ డిజాస్టర్ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజు కేవలం 5 నుండి 6 కోట్ల రూపాయిల రేంజ్ లోనే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ పెంచడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది అనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకు టికెట్ రేట్స్ ఉన్నా జనాలు పట్టించుకోరు. కానీ డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా టికెట్ రేట్స్ భారీగా ఉంటే చూడాలని అనుకునే ఆడియన్స్ ఎలా చూస్తారు చెప్పండి?, పైగా నాలుగు వారాల తర్వాత ఓటీటీ లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడైతే టాక్ లేకపోతే అసలు చూసే పరిస్థితి లేదు. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో అయితే మొదటి రోజే తక్కువ వసూళ్లు వచ్చాయి. మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి వస్తాయని అనుకుంటే , ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి హాఫ్ మిలియన్ డాలర్లు కూడా రాలేదు. ఇక రెండవ రోజు అయితే కనీసం 50 వేల డాలర్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ లో 6 లక్షల డాలర్లు రావడం కూడా కష్టమే అట.