Akhand 2: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా ఈనెల 5వ తేదీన రిలీజ్ కి సిద్ధమైంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అనే దానిమీద కొన్ని రోజుల నుంచి సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది… మేకర్స్ నుంచి సరైన క్లారిటీ రాకపోవడంతో అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు సైతం కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా వరకు హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అఖండ 2 రిలీజ్ దాకా వచ్చి ఆగిపోవడం అనేది నిజంగా బాలయ్య బాబు కెరియర్ లోనే ఇది మొదటిసారి… ఇక ఇలాంటి వాటి వల్ల బాలయ్య బాబు ఇమేజ్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉందని వాళ్లందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈనెల 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి బాకీ పడిన మొత్తాన్ని చెల్లించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు… ఈరోస్ సంస్థ నుంచి కూడా సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు అనే ఒక నాన్ అబ్జెక్షన్ లెటర్ వచ్చింది. దాంతో ఈ సినిమాని 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటికే రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజు దర్శకత్వంలో వస్తున్న మోగ్లీ సినిమా 12 వ తేదీన రిలీజ్ సిద్ధమైంది. ఇక ‘అఖండ 2’ సినిమా అదే రోజున వస్తే మాత్రం వాళ్ళు తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కారణం ఏంటి అంటే అఖండ 2 సినిమాను ఎదుర్కొనే కెపాసిటి మోగ్లీ సినిమాకి లేకపోవడం వల్లే వాళ్ళు తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత తమ సినిమాని రిలీజ్ చేసుకోవాలని ప్రయత్నం చేసిన మోగ్లీ సినిమాకి భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. బాలయ్య అక్కడ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడం మోగ్లీ సినిమాకి బాగా ఇబ్బందిని కలిగిస్తోంది. ఇక ఈ సినిమా కనుక ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే ఈ సినిమాను మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని మీద కూడా సరైన క్లారిటీ రాదు.
ఎందుకంటే డిసెంబర్ నెల మొత్తం చాలా సినిమాలు తమ డేట్స్ ను ఫిక్స్ చేసుకొని ఉన్నాయి. ఇక జనవరిలో అయితే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే సంక్రాంతికి ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక మోగ్లీ సినిమాకి థియేటర్లు దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పుడు కనక పోస్ట్ పోన్ అయితే ఈ సినిమా ఫిబ్రవరి కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి… మొత్తానికైతే ‘అఖండ 2’ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకొని మోగ్లీ సినిమా ఉసురు పోసుకుంటుంది…