Allu Arjun Wife Sneha Reddy: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలకు అరుదైన గౌరవమైతే దక్కింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ టాప్ పొజిషన్లో నిలిచారు. అల్లు అర్జున్ సైతం మెగా ఫ్యామిలీ హీరోగా కొద్ది రోజులపాటు కొనసాగినప్పటికి ప్రస్తుతం ఆయన అల్లు ఆర్మీ అంటూ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ భార్య అయిన అల్లు స్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన హ్యాపీనెస్ ని పంచుకుంటూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 9 వ తేదీన తన కూతురు అయిన ఆర్హ బర్త్డే ఉన్న సందర్భంలో అబుదాబి కి వెళ్ళిన ఆమె తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి నాలుగు రోజులపాటు ఎవరు నిద్ర పోకూడదని, ఫోన్లను కూడా వాడకూడదని ఒక టాస్క్ ను విధించి ఆరా బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఇక మొత్తానికైతే ఇలాంటి నియమాలు పెట్టుకోడానికి బాగానే ఉంటాయి.
కానీ వాటిని పాటించే వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. ఇక స్నేహ రెడ్డి సైతం ఈ టాస్క్ విధించిన వెంటనే తన ఫ్రెండ్స్ దీన్ని పాటిస్తారు అనుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే పడుకోవడం చేశారు. దాంతో స్నేహ రెడ్డి ఓ ఫన్నీ వీడియోని సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది… ఇక ఇది చూసిన అభిమానులు చాలా వరకు నవ్వుకుంటున్నారు.
ప్రస్తుతం స్నేహ రెడ్డి తమ పిల్లల్ని చూసుకుంటుంటే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద చాలా కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే మరో షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి భారీ విక్టరీని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…