Romantic Movie: యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రాబోతున్న సినిమా ‘రొమాంటిక్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అనిల్ పాడూరి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మొదట నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు.

అయితే, నవంబర్ 4న కంటే అక్టోబర్ 29న బెటర్ అని మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంగా సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకం పై పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. నిజానికి లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కానీ అప్పటి నుంచి కరోనా కారణంగా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.
కాగా ఈ చిత్రంలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ మోడ్రన్ అత్తగా కనిపించి అలరించింది.
ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది. తన కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జగన్నాథ్ తనకున్న కాస్త డబ్బును పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ పూరి మొదటి సినిమాకే పూరికి పదిహేను కోట్లు వరకూ లాస్ అని పూరి ఆఫీస్ నుండే బయటకు రూమర్స్ వినపడ్డాయి. ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’ కోసం కూడా పూరి జగన్నాథ్ బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ‘రొమాంటిక్’ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలతో పాటు యూత్ ను బాగా ఆకట్టుకునే బోల్డ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయట. మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా చూడాలి.