Chor Bazaar Movie Review: నటీనటులు : ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్‌బాబు, లక్ష్మణ్
దర్శకుడు : బి.జీవన్‌రెడ్డి
నిర్మాత : వి.ఎస్.రాజు
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి
జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చోర్ బజార్. దర్శకుడు పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించారు. గెహన సిప్పీ హీరోయిన్ గా నటించింది . జూన్ 24న చోర్ బజార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. చోర్ బజార్ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించిందో రివ్యూలో చూద్దాం..
కథ
హైదరాబాద్ పాతబస్తీలోని చోర్ బజార్ దొంగతనాలకు, దొంగిలించిన వస్తువులను అమ్మడానికి బాగా ఫేమస్. ఆ ఏరియాకు అమితాబ్ సాబ్(ఆకాష్ పూరి) కింగ్ గా ఉంటాడు. మరోవైపు గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) చోర్ బజార్ పూర్తిగా మూసేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అమితాబ్ సాబ్ మూగమ్మాయి (గెహన సిప్పీ) ప్రేమలో పడతాడు. ఇంతలో హైదరాబాద్ మ్యూజియంలో రూ. 200 కోట్ల విలువ చేసే వజ్రం దొంగతనానికి గురవుతుంది. ఆ వజ్రం దొంగతనం చేసింది ఎవరు? దానితో అమితాబ్ సాబ్ కి సంబంధం ఏమిటీ? వజ్రం దొంగతనం వలన అమితాబ్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటీ? అనేది మిగతా కథ…
Also Read: Modern Love Hyderabad: Amazon Prime Video | జులై 8న ఆరు కథలతో కూడిన “మోడ్రన్ లవ్ హైదరాబాద్” విడుదల
విశ్లేషణ
స్టార్ డైరెక్టర్ పూరి కొడుకుగా పరిశ్రమకు పరిచయమైన ఆకాష్ పూరి ఓ సాలిడ్ బ్రేక్ కోసం చూస్తున్నాడు. హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కాన్ఫిడెంట్ గా ముందుకు వెళుతున్నారు. ఆయన ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ లో విషయం ఉంటున్నప్పటికీ ప్రెజెంటేషన్ ప్రాబ్లం వలన తేడా కొడుతున్నాయి. ఆకాష్ పూరి గత చిత్రాలు మెహబూబా, రొమాంటిక్ చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
చోర్ బజార్ కూడా అలాంటి తప్పటడుగే అని చెప్పాలి. కమర్షియల్ గా ఆడకున్నా జార్జి రెడ్డి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చోర్ బజార్ పై అంచనాలు ఏర్పడ్డాయి. చోర్ బజార్ ఆరంభం చాలా బాగుంటుంది. వజ్రం చోరీ ఎపిసోడ్స్, దాని వెనుక ఎవరున్నారనే క్యూరియాసిటీ దర్శకుడు ప్రేక్షకుడికి కలిగించగలిగారు. అయితే ఆ టెంపో ఎంతో సేపు కొనసాగలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన పాత్రల పరిచయానికే తీసుకున్నారు. మంచి స్క్రీన్ ప్లే తో సస్పెన్సు సన్నివేశాలతో సినిమాను నిర్మించుకుంటూ వెళ్ళాల్సింది. అలా జరగలేదు. మెల్లగా సినిమా గ్రాఫ్ పడిపోతూ వెళుతుంది.
Also Read: Rajendra Prasad’s Son: షాకింగ్..రాజేంద్రప్రసాద్ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..?
సెకండ్ హాఫ్ ఆకాష్ పూరి ఫ్లాష్ బ్యాక్ కి కేటాయించారు. రొటీన్, లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి. సంపూర్ణేష్ బాబు, సునీల్, సుబ్బరాజ్ వంటి నటులకు సినిమాలో సరైన స్పేస్ లేదు. ఆకాష్ పూరి యాక్షన్ ఇరగదీసినా నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. హీరోయిన్ గెహన సిప్పీ పర్వాలేదు అనిపించారు. మూగ అమ్మాయిగా ప్రేక్షకులను బాగానే నమ్మించారు. సురేష్ బొబ్బొలి సంగీతం ఆకట్టుకుంది. జగదీశ్ కెమెరా వర్క్ బాగుంది. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. క్లైమాక్స్ మాత్రం దర్శకుడు మంచిగా రాసుకున్నారు. రెండు గంటల తర్వాత ప్రేక్షకుడికి ఉపశమనం కలిగించింది.
ప్లస్ పాయింట్స్
యాక్షన్ సన్నివేశాలు
మ్యూజిక్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
కథ
లాజిక్ లేని సన్నివేశాలు
సినిమా చూడాలా? వద్దా?
దర్శకుడు జీవం రెడ్డి ఓ రొటీన్ స్టోరీకి కమర్షియల్ అంశాలు అద్ది ఆసక్తికరంగా తెరకెక్కించాలన్న ప్రయత్నం చేశారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మంచి ఆరంభం లభించినా కొనసాగించలేకపోయాడు. లాజిక్స్ లేని సన్నివేశాలు, పూర్ స్క్రీన్ ప్లే సినిమా ఫలితం దెబ్బతీశాయి. ప్రారంభంతో పాటు క్లైమాక్స్ అలరిస్తుంది. పూరి ఫ్యాన్స్ వాళ్ళ అబ్బాయి కోసం ఓ సారి చూడొచ్చు.
రేటింగ్: 2.5