Homeఎంటర్టైన్మెంట్Ajith Kumar racing video: రేసింగ్ లో ఇండియా జెండా రెపరెపలాడేలా చేసిన తమిళ హీరో...

Ajith Kumar racing video: రేసింగ్ లో ఇండియా జెండా రెపరెపలాడేలా చేసిన తమిళ హీరో అజిత్.. వీడియో వైరల్..

Ajith Kumar racing video: తమిళనాడు లోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు అజిత్ కుమార్(Ajith Kumar). ఎంజీఆర్ , సూపర్ స్టార్ రజినీకాంత్ , వంటి దిగ్గజాల తర్వాత , వాళ్ళ స్థాయిలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు అజిత్ కుమార్. అయితే ఈమధ్య కాలం లో ఈయన సినిమాలు చేయడం బాగా తగ్గించేసాడు. సినిమాల మీదకంటే ఎక్కువగా రేసింగ్ పైన ఫోకస్ పెట్టాడు. గత ఏడాది నుండి ఈయన వరుసగా కారు రేసింగ్ పోటీలలో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఈయన బెల్జియం రేసులో గెలుపొంది మన ఇండియన్ జెండా ని రెపరెపలాడేలా చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అజిత్ అభిమానులు ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రపంచం లోనే అత్యంత కఠినమైన ఎండ్యూరెన్సు రేసులలో ఒకటి బెల్జియం లోని ‘సర్క్యూట్ ది స్పా – ఫ్రాంకోర్ చాంప్స్’ .

ఈ రేసింగ్ ట్రాక్ పై జరిగిన 24H సిరీస్ అజిత్ రేసింగ్ టీం రెండో స్థానం లో నిలిచి మన ఇండియన్ సత్తా చాటేలా చేసింది. ఈ విజయం అనంతరం పోడియం పై మన భారత దేశపు జెండా ని సగర్వంగా ఎగురవేస్తూ , అజిత్ మరియు అతని టీం షాంపైన్ తో సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా అజిత్ మేనేజర్ మాట్లాడుతూ ‘అభిరుచి , గర్వం రెండు ఓకే చోట కలిసిన రోజు మన భారత దేశపు జెండా రెపరెపలాడుతోంది. అజిత్ టీం నేడు మన భారత దేశం గర్వపడే విజయాన్ని నమోదు చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వరుసగా రేసింగ్ లో విజయాలు సాధిస్తూ , అజిత్ మరియు ఆయన టీం దేశానికీ గర్వకారణం లాగా నిలబడడం నిజంగా ఎంతో అభినందించదగ్గ విషయం.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే , గత ఏడాది ఈయన హీరో గా నటించిన ‘విడాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిల్లో ‘విడాముయార్చి’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా , ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అద్విక్ రవిచంద్రన్ ఇప్పుడు అజిత్ తో మరో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆయన సినిమాల మీదకంటే ఎక్కువ ఫోకస్ రేసింగ్ మీదనే పెట్టాడు. ఒక నెలలో 15 రోజులు సినిమా షూటింగ్స్ కి , మరో 15 రోజులు రేసింగ్ కి కేటాయించాలని అనుకుంటున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version