Homeఎంటర్టైన్మెంట్Tollywood 2027 Summer: 2027 సమ్మర్ మీదనే టాలీవుడ్ భారీ ఆశలు.. పవన్ కళ్యాణ్ తప్ప...

Tollywood 2027 Summer: 2027 సమ్మర్ మీదనే టాలీవుడ్ భారీ ఆశలు.. పవన్ కళ్యాణ్ తప్ప స్టార్ హీరోల సినిమాలన్నీ వస్తున్నాయ్..

Tollywood 2027 Summer: ఈ ఏడాది సమ్మర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గడ్డు కాలం గా మారింది. ఒకప్పుడు సమ్మర్ అంటే ఎలా ఉండేదో మన అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు నెలకు ఒకటి విడుదల అయ్యేది. ఒకటి కాకపోయినా మరొకటి సూపర్ హిట్ గా నిలిచేది. థియేటర్స్ నిత్యం జనాలతో నిండిపోయి కళకళలాడుతూ ఉండేది. కానీ ఈ ఏడాది సమ్మర్ సీజన్ ని చూస్తుంటే సినీ ప్రేమికులకు కన్నీళ్లు రాక తప్పదు. సమ్మర్ ఆరంభానికి ముందు విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత విడుదలైన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సమ్మర్ కి కేవలం చిన్న సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. వాటిల్లో ఒకటి కూడా విజయం సాధించలేదు.

దీంతో వర్కింగ్ డేస్ లో థియేటర్స్ కి జనాలు కదలడం లేదు. ఫలితంగా థియేటర్స్ మూతపడుతున్నాయి. సమ్మర్ లో సినిమాలు లేక థియేటర్స్ మూత పడడం వంటివి మనం కలలో కూడా ఊహించి ఉండము. అలా కలలో కూడా అనుకోని సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత మన టాలీవుడ్ కి పీక్ సమ్మర్ సీజన్ సంవత్సరం ఏదైనా ఉందా అంటే అది 2022 మాత్రమే. అల్లు అర్జున్ మినహా స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలయ్యాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ , ప్రభాస్ రాధే శ్యామ్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ #RRR , చిరంజీవి – రామ్ చరణ్ ఆచార్య, మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. నాలుగు నెలల పాటు థియేటర్స్ జనాల రద్దీ తో కిక్కిరిసిపోయాయి. అలాంటి సమ్మర్ సీజన్ వచ్చే ఏడాదిలో మనమంతా చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ మినహా, స్టార్ హీరోలందరూ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీస్ తో మన ముందుకు రాబోతున్నాడు.

ముందుగా మార్చి 5న ప్రభాస్ , సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్’ చిత్రం రాబోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 7న రాజమౌళి ‘వారణాసి’ రాబోతుంది. మే నెలలో అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రం విడుదల కావొచ్చు. అదే విధంగా జూన్ 11 న ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ విషయాన్నీ డ్రాగన్ మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇలా స్టార్ హీరోలు ప్రెస్టీజియస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. వీటిలో ‘డ్రాగన్’, ‘వారణాసి’ విడుదల తేదీలు మారితే మారొచ్చని అంటున్నారు , ఇందులో ఎన్ని సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రకటించిన తేదీల్లో వస్తాయో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version