Ajith Kumar : ప్రముఖ తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్(Thala Ajith Kumar) కి గాయాలు అవ్వడం తో, హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఢిల్లీ లోని రాజ్ భవన్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి పద్మభూషణ్ అవార్డు తీసుకోవడానికి వెళ్లిన అజిత్, ఆ తర్వాత తిరిగి వస్తుండగా, ఢిల్లీ విమానాశ్రయం లో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడం తో, పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో ఆయన కాళ్లకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స అందించారు. ఇది చాలా చిన్న గాయమని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేడు సాయంత్రం లోపు ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడని అజిత్ టీం మీడియా కి ముఖ్యమైన సమాచారం అందించింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ కి ఇలాంటి గాయాలు కొత్తేమి కాదు.
Also Read : సందీప్ వంగ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్..’స్పిరిట్’ ఇక లేనట్టే!
రీసెంట్ గానే ఆయన ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ గేమ్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ఈయన కార్ అదుపు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు ప్రమాదానికి గురైంది. ఇక సినిమాల్లో అజిత్ డూప్స్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తూ ఉంటాడు. ఆ కారణం చేత ఆయన శరీరం పై ఎన్నో గాయాలు అయ్యాయి. అయినప్పటికీ పట్టించుకోకుండా, షూటింగ్స్ కానిచ్చేవాడు. ఇకపోతే ప్రైవేట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే అజిత్ ఈమధ్య కాలంలోనే కాస్త జనాల్లోకి వస్తున్నాడు. రీసెంట్ గా చీపక్ స్టేడియం లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ టీం మ్యాచ్ కి ఆడియన్స్ గ్యాలరీ లో కూర్చొని చూసాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత, ఇండియా టుడే మీడియా కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.
దాదాపుగా 16 ఏళ్ళ తర్వాత అజిత్ ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. అయితే ఈ ఇంటర్వ్యూ వీడియో రూపం లో లేదు, ఆడియో రూపం లో ఉంది. తన జయాపజయాల వెనుక నిలబడిన వారి గురించి, తన అభిమానులు చూపించే ప్రేమ గురించి ఆయన ఈ ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మాటలను విన్న తర్వాత ఎవరికైనా సరే, ఇంత సింపుల్ గా ఉండడం ఎలా సాధ్యం అని అనిపించక తప్పదు. ఒక సాధారణ మనిషి లాగా ఆయన మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ కి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కేవలం కొంత భాగం మాత్రమే, ఇంకా చాలా ఇంటర్వ్యూ బ్యాలన్స్ ఉందట. దాని కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న అజిత్, తన తదుపరి చిత్రం ఏమిటి అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.