https://oktelugu.com/

Ajith : కోలీవుడ్ స్టార్ అజిత్ కూతురు లేటెస్ట్ ఫోటోలు చూశారా..? స్టార్ హీరోయిన్స్ కూడా ఈమె అందం చూసి అసూయపడతారు!

Ajith : తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ 3 సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో తల అజిత్(Thala Ajith Kumar) పేరు కచ్చితంగా ఉంటుంది. హిట్/ఫ్లాప్ తో సంబంధం లేకుండా తమిళనాడు లో ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టడం ఇతని స్టైల్.

Written By:
  • Vicky
  • , Updated On : March 3, 2025 / 04:48 PM IST
    Ajith

    Ajith

    Follow us on

    Ajith : తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ 3 సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో తల అజిత్(Thala Ajith Kumar) పేరు కచ్చితంగా ఉంటుంది. హిట్/ఫ్లాప్ తో సంబంధం లేకుండా తమిళనాడు లో ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టడం ఇతని స్టైల్. అందరి హీరోల లాగా తన సినిమాలకు ప్రొమోషన్స్ చేసుకోడు, ఇంటర్వ్యూస్ ఇవ్వడు, కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపించడు. కేవలం వెండితెర మీద తప్ప, అజిత్ ని అభిమానులు బయట చూడడం అంటే, కార్ రేసింగ్ గేమ్స్ లోనే చూడాలి. అంతే తప్ప ఆయనకు అభిమానులకు దగ్గరగా ఉండే కనెక్షన్ ఒక్కటి కూడా లేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా అందుబాటులోకి వస్తాడా అంటే అది కూడా లేదు. ఇలా అభిమానులతో ఏమాత్రం ఎమోషనల్ కనెక్షన్ లేకపోయినా, అజిత్ అంటే ఆయన అభిమానులు ప్రాణాలు ఇచ్చేస్తారు.

    Also Read : అల్లు అర్జున్, అజిత్ కాంబోలో రాజమౌళి సినిమా చేయాలనుకున్నారా..? అది ఎందుకు వర్కౌట్ కాలేదంటే..?

    ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో బహుశా ఇండియా లో ఎక్కడా ఉండరేమో. ఇదంతా పక్కన పెడితే అజిత్ ప్రముఖ స్టార్ హీరోయిన్ షాలిని ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసిన షాలిని, కోలీవుడ్ లో దాదాపుగా అప్పట్లో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లో కూడా ఈమె బాలనటిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఉన్న శిఖరాలకు చేరుకుంటున్న సమయంలో ఆమె అజిత్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు దూరం అయ్యింది. ఈ దంపతులిద్దరికీ అనౌష్క అనే అమ్మాయి, అద్విక్ అనే కొడుకు ఉన్నారు. వీళ్లిద్దరికీ సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనౌష్క(Anoushka Kumar) ఫోటోలు అయితే వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందాయి.

    ఈ అమ్మాయి చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్స్ అందరికంటే ఈమె వెయ్యి రెట్లు మేలు అనిపిస్తుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం ఉందో లేదో తెలియదు కానీ, సినిమాల్లోకి వస్తే మాత్రం ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి హీరోయిన్ గా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొడుకు కూడా నిన్న గాక మొన్న పుట్టినట్టు అనిపిస్తున్నాడు కానీ, అతను కూడా బాగా ఎదిగిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా అందంగా ఉండడంతో పిల్లలు కూడా అంతే అందంగా పుట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘విడాముయార్చి'(Vidaamuyaarchi Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. వచ్చే నెల11న ఆయన హీరో గా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం విడుదల అవుతుంది. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు, రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

    Also Read : రేసు పందెంలో ప్రమాదానికి గురైన తమిళ హీరో అజిత్ కారు..వైరల్ అవుతున్న వీడియో..ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే!