కరోనా దెబ్బకు ఏడాది ఆలస్యంగా అజయ్ దేవగణ్‌ మూవీ

సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోగా.. థియేటర్లు మూత పడడంతో సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు ఆందోళన చెందుతుందున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే బాలీవుడ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫైనాన్స్‌ ఇబ్బందులు తప్పించుకునేందుకు ఓటీటీల బాట పడుతున్నారు. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు మరో ఐదు బాలీవుడ్‌ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 5:09 pm
Follow us on


సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోగా.. థియేటర్లు మూత పడడంతో సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు ఆందోళన చెందుతుందున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే బాలీవుడ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫైనాన్స్‌ ఇబ్బందులు తప్పించుకునేందుకు ఓటీటీల బాట పడుతున్నారు. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు మరో ఐదు బాలీవుడ్‌ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న మరికొన్ని సినిమాలు రిలీజ్‌ డేట్స్‌ వెనక్కివెళ్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రం ఏకంగా ఏడాదికి వెనక్కి వెళ్లింది.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్, హైదరాబాదీ సయ్యద్‌ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘బదాయి హో’ మూవీతో నేషనల్‌ అవార్డును అందుకున్న అమిత్‌ రవీందర్‌నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మాత. అక్షయ్‌ సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌లో ప్రపంచ దేశాలపై భారత్ అద్భుత ఆధిపత్యం చెలాయించింది. ఆ టైమ్‌లో నేషనల్‌ టీమ్‌కు అబ్ధుల్ ర‌హీం కోచ్‌గా, మేనేజర్గా వ్యవహరించారు. ఆయన భారత జట్టును తీర్చిదిద్దిన విధానం, అప్పటి పరిస్థితులు, రహీం జీవితం ఎలా ఉండేదన్న ఇతివృత్తమే ఈ చిత్ర కథాంశం. కొద్ది రోజుల క్రిత్రం అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫస్ట్‌ లుక్‌ని విడుద‌ల చేశారు. లాక్‌డౌన్ ముందు వరకూ చిత్రీకరణ జరిగిన ఈ మూవీని తొలుత ఈ ఏడాది న‌వంబ‌ర్ 27న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడడంతో చిత్రాన్ని ఏకంగా వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం పేర్కొంది. 2021 ఆగ‌స్ట్ 13వ తేదీన ‘మైదాన్‌’ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.