పవన్‌ మూవీలో రామ్‌ చరణ్ ?

అజ్ఞాతవాసి’ అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టి కొంతకాలం సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ప్రేక్షకుల్లోనే కాకుండా టాలీవుడ్‌ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌, ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మూవీపై హైప్‌ మరింత పెంచింది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 5:14 pm
Follow us on


అజ్ఞాతవాసి’ అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టి కొంతకాలం సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ప్రేక్షకుల్లోనే కాకుండా టాలీవుడ్‌ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌, ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మూవీపై హైప్‌ మరింత పెంచింది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం ఈ మూవీ చిత్రీకరణ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. సాధారణంగా ఓ చిత్రం పూర్తయ్యాకే మరో కథ వినే పవన్‌… ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ నడుస్తుండగానే జాగర్లమూడి క్రిష్తో సినిమాకు అంగీకరించాడు. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు క్రిష్. ఇది ఓ పీరియాడికల్‌ స్టోరీ అని సమాచారం.

మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

క్రిష్, పవన్‌ ప్రెస్టేజియస్‌గా భావిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కూడా నటించబోతున్నాడట. అయితే, ఇది కీలక పాత్ర లేక కెమెరా అప్పియరెన్సా అనేది తెలియాలి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌తో అబ్బాయ్‌ చరణ్‌ తొలిసారి తెర పంచుకోనున్నాడు. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. ప్రస్తుతానికి చరణ్.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ‘ఆచార్య’కు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో కూడా చరణ్ ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్స్‌ రెండూ వాయిదా పడ్డాయి.