https://oktelugu.com/

Aishwarya Rai: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్య రాయ్..అందుకే భర్త అభిషేక్ బచ్చన్ కు దూరంగా ఉంటుందా?

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో పాటు త్రిష, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి కుర్ర హీరోయిన్లు నటించారు. వీళ్ళందరూ ఐశ్వర్య రాయ్ అందం ముందు తేలిపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోబోతుందని, ప్రస్తుతం ఆమె తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుందని, అనంత్ అంబానీ పెళ్ళికి కూడా ఐశ్వర్య రాయ్ తన కూతురుతో కలిసి వచ్చిందని, బచ్చన్ ఫ్యామిలీ కి దూరంగా ఉండిందని బాలీవుడ్ లో ఒక వార్త పెద్ద సెన్సేషన్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 27, 2024 / 05:34 PM IST

    Aishwarya Rai

    Follow us on

    Aishwarya Rai: అందానికి పర్యాయపదం లాగా ఉండే హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఏ అమ్మాయి అయినా అందంగా ఉంటే చాలు ఐశ్వర్య రాయ్ తో పోల్చి చూస్తాము. అందం లో ఆమె ఏర్పాటు చేసిన బెంచ్ మార్క్ అలాంటిది. విశ్వసుందరి గా ప్రసిద్ధి గాంచిన ఐశ్వర్య రాయ్, సినిమాల్లో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన ఐశ్వర్య రాయ్, రీ ఎంట్రీ తర్వాత మళ్ళీ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఆమె వయస్సు ప్రస్తుతం 51 సంవత్సరాలు. కానీ వెండితెరపై ఆమె కనిపిస్తే, ఆమె పక్కన ఉన్న కుర్ర హీరోయిన్లు తేలిపోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ.

    ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో పాటు త్రిష, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి కుర్ర హీరోయిన్లు నటించారు. వీళ్ళందరూ ఐశ్వర్య రాయ్ అందం ముందు తేలిపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకోబోతుందని, ప్రస్తుతం ఆమె తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుందని, అనంత్ అంబానీ పెళ్ళికి కూడా ఐశ్వర్య రాయ్ తన కూతురుతో కలిసి వచ్చిందని, బచ్చన్ ఫ్యామిలీ కి దూరంగా ఉండిందని బాలీవుడ్ లో ఒక వార్త పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమెకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ న్యూస్ ఆమె అభిమానులను తీవ్రమైన ఆందోనళకు గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఐశ్వర్య రాయ్ ఇటీవలే ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా పాల్గొన్నది. ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ ముఖాన్ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు. ఐశ్వర్య రాయ్ ముఖం లో ఎదో తేడా వచ్చింది, అసలు ఈమెకి ఏమైంది అని అభిమానులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీంతో షాకింగ్ నిజాలు బయటకు వెలువడ్డాయి.

    ఆమె గత కొంతకాలం నుండి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందట..ఒక ప్రాణాంతక వ్యాధి కారణంగా ఆమె సరిగా టాబ్లెట్స్ కూడా వేసుకోలేకపోతుందట. ఈ వ్యాధి చికిత్స కోసమే ఆమె విదేశాలకు తన కూతురుతో కలిసి వెళ్లిందని, అక్కడ డాక్టర్లు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటూ చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పడంతో ఐశ్వర్య రాయ్ అక్కడే గత కొంతకాలం గా తన భర్త కి, కుటుంబానికి దూరంగా ఉంటూ చికిత్స చేయించుకుంటుంది అని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ మహేష్ – రాజమౌళి సినిమాలో ఒక కీలక పాత్ర చేసేందుకు సంతకం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.