Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ కాస్త ఆసక్తికరంగా, కాస్త చప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా సీజన్ 7 తో పోలిస్తే ఈ సీజన్ బాగా తగ్గింది అనేది మాత్రం నిజం. ట్విస్టుల పేరుతో బిగ్ బాస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా ప్రేక్షకులకు బాగా చిరాకు కలిగిస్తున్నాయి. గత వారం ఎలిమినేట్ అయిన అభయ్ బిగ్ బాస్ మీద అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలలో ఒకటైతే కచ్చితంగా నిజం. ఇది బిగ్ బాస్ కాదు, ‘బయాసిడ్ బాస్’. ఈ వారం జరిగిన టాస్కులలో బిగ్ బాస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సోనియా ఏ టీం లో ఉంటే, ఆ టీం కి బిగ్ బాస్ వరాల జల్లు కురిపిస్తున్నాడు. అంతే కాదు ఆమెకి సంబంధించిన చాలా వరకు నెగటివ్ కంటెంట్ ని ఎడిటింగ్ లో తొలగించి టీవీ లో టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ లో చూపించిన కంటెంట్ చాలా వరకు కనిపించడం లేదు.
చూస్తుంటే సోనియా మ్యానేజ్మెంట్ కోటాలో హౌస్ లోకి అడుగుపెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఈ వారం జరగబోయే ఎలిమినేషన్ ఈ సీజన్ హిట్టా, ఫట్టా అనేది నిర్ణయిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సోనియా పై సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన నెగటివిటీ ఉంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా ఈమె ఏమాత్రం నచ్చడం లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే నిఖిల్, పృథ్వీ లను తన తొత్తులుగా మార్చుకొని వాళ్ళ ఆట తీరుని, ఆలోచన తీరుని ప్రభావితం చేస్తూ టైటిల్ రేస్ నుండి తప్పించేలా చేస్తుంది. ఇది నిఖిల్ అభిమానులకు కూడా అర్థమైంది, అందుకే ఈమె ఎలిమినేషన్ ని వాళ్ళు కూడా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈమె ఎలిమినేషన్ అంత తేలికైన విషయం కాదు అనేది అందరూ గమనించాలి. ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కంటే ఈమెకు బలమైన పీఆర్ టీం ఉంది. దానికి తోడు బిగ్ బాస్ టీం కూడా ఈమెను కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వీళ్లకు తోడు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా సోనియా గెలుపు కోసం తెగ కష్టపడుతున్నాడు. ఆమెకు సపోర్టుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్టులు వేయడమే కాకుండా, తనకు తెలిసిన కొన్ని కన్సల్టెన్సీల ద్వారా ఆమెకు భారీ స్థాయిలో ఓట్లు పడేలా చేస్తున్నారు. అందుకే ఆమె ఎలిమినేషన్ అంత తేలిక కాదు. పైగా హౌస్ లో నిఖిల్, పృథ్వీ తప్ప అందరూ ఆమెని విలన్ లాగా చూస్తారు. ఆమె చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. హౌస్ లో ఒక విలన్ ఉంటేనే కదా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్, అందుకే బిగ్ బాస్ టీం కూడా ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఈ వారం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఆమెకు బదులుగా ఆదిత్య ఓం, లేదా పృథ్వీ ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ. సింగల్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య ఓం, డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మరి ఏమి జరగబోతుందో చూడాలి.