https://oktelugu.com/

3 Roses: 3 రోజెస్ వెబ్ సిరీస్ నుంచి మరో ట్రైలర్ విడుదల…

3 Roses: మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’ అనే వెబ్ సీరియస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు మగ్గీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నిర్మాతగా ఎస్‌కేఎన్ వ్యవహరిస్తుండగా… సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ‘ఆహా’లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. అయితే, కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే టెలికాస్ట్ చేశారు. కాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 04:27 PM IST
    Follow us on

    3 Roses: మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’ అనే వెబ్ సీరియస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు మగ్గీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నిర్మాతగా ఎస్‌కేఎన్ వ్యవహరిస్తుండగా… సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ‘ఆహా’లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. అయితే, కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే టెలికాస్ట్ చేశారు.

    కాగా ఈ రోజు నుంచి మిగతా ఎపిసోడ్స్‌ కూడా ప్రసారమవుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆహా’ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ వెబ్ సీరిస్‌లో నటిస్తున్న ఇషా, పాయల్, పూర్ణలు చాలా బోల్డ్‌గా కనిపించడమే కాదు… వారి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, మోహంలో ఏది సరైన దారో తెలియక తికతికమక పడుతున్న ఈ ముగ్గురు భామలు నేటి సమజాన్ని పచ్చి బూతులతో తిట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రసారం కాబోయే ఎపిసోడ్స్ మరింత వినోదాత్మకంగా ఉంటాయనిపిస్తోంది. వైవా హర్షాతో ఇషా పడే పాట్లు…  పాయల్, ప్రిన్స్ రొమాన్స్… పూర్ణ వరుడి వేట ఇలా బోలెడంత వినోదాన్ని అందించినున్నట్లు ఈ ట్రైలర్ వీడియో ద్వారా తెలుస్తోంది.

    చివర్లో ఇషా ‘రివేంజ్’ పదాన్ని ‘ఆర్ షుడ్ బీ రోల్’ అంటూ మంచు లక్ష్మి డైలాగ్ ని వాడేశారు. అలానే సన్నీ ఎం.ఆర్. ఈ వెబ్ సిరీస్ కి  సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.