Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించినా “అఖండ” చిత్రం విడుదలైన అప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద కనకపు వర్షం కురిపిస్తూనే ఉంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకుంది. బోయపాటి శ్రీనివాస్ – బాలయ్య కాంబినేషన్ లో హైట్రిక్ విజయం అందుకోవడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు ఎక్కడో అడవిలో తపస్సు చేసుకుంటూ శివ నామస్మరణ చేసుకుంటూ ఉండే అఘోరాలు. ఈ చిత్రం చూడడానికి రావడం విశేషంగానే చెప్పాలి. ప్రస్తుతం ఇది హాట్ వార్తగా మారింది. ఈ సినిమాలో ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించగా… ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. కాగా తమన్ ఈ చిత్రానికి అద్బుతమైన సంగీతం అందించారు.
Also Read: Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…
ఈ సినిమాలోని ఫైట్లు డైలాగులు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చాయని చెప్పాలి. అందులో బాలయ్య నట విశ్వరూపం చూపించారని సినీ ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం కుడా తెలిసినదే. ఇలాంటి తరుణంలో… విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేసారు. శరీరానికి విభూతి తాయత్తు లతో థియేటర్ కు వచ్చేశారు. నందమూరి బాలయ్య అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమా పూర్తయిన తర్వాత శివ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అఖండ మూవీతో అఘోరాలు కూడా బాలయ్య అభిమానులు అయిపోయారు అంటూ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Also Read: Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్