Mahesh Babu: దేశం మెచ్చిన దర్శకులతో మహేష్ చిత్రాలు… రాజమౌళి తర్వాత ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ తో?

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్న మహేష్ నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హాలీవుడ్ కట్ అవుట్ కలిగిన మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అదే స్థాయిలో ఉండనుంది.

Written By: Shiva, Updated On : July 10, 2023 11:33 am

Mahesh Babu

Follow us on

Mahesh Babu: టాలీవుడ్ లో అరడజనుకు పైగా టాప్ హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరు రూ. 50 నుండి రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ మార్కెట్ ఇతర పరిశ్రమలకు పాకింది. దీంతో ఇతర భాషల దర్శకులు మన హీరోలతో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఆయన ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. అయినా ఆయనకు నేషనల్ వైడ్ ఫేమ్ ఉంది. పలు అంతర్జాతీయ ఉత్పత్తులకు ఆయన ప్రచారకర్తగా ఉన్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్న మహేష్ నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హాలీవుడ్ కట్ అవుట్ కలిగిన మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అదే స్థాయిలో ఉండనుంది. రాజమౌళి తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కించనున్నారు. ఇండియన్ ఫిలిం హిస్టరీ లో కూడా ఇది అత్యంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం రాజమౌళి-మహేష్ మూవీ బడ్జెట్ రూ. 800 కోట్లు.

హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు భాగం కానున్నారు జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా రాజమౌళి మూవీ అనంతరం మహేష్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగాలతో కమిట్ అయ్యారట. మహేష్ 30, 31 ఈ దర్శకులతోనే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. అనంతరం ఎన్టీఆర్ తో మూవీ చేస్తారు. ఆ నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తారట. ఇక సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ పూర్తి చేయాల్సి ఉంది. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా మహేష్ తో మూవీ చేస్తారట. దేశం మెచ్చిన దర్శకులుగా ఉన్న రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగాల చిత్రాలతో మహేష్ రేంజ్, ఫేమ్ ఊహించని స్థాయికి చేరడం ఖాయం.