Senior NTR Mythological Roles: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు (NTR) గారు మొదటి స్థానంలో ఉంటారు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు… ఇక ముఖ్యంగా పౌరాణిక పాత్రలను పోషించడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు అనేంతలా మంచి ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ఇక తన తర్వాత కాలంలో కొంతమంది హీరోలు పౌరాణిక పాత్రలను పోషించినప్పటికి వాళ్లకి పెద్దగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు(Balayya Babu) సైతం పౌరాణిక పాత్రాలను పోషించాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలిచాయి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి తర్వాత పౌరాణిక పాత్రలను పోషించడంలో అంత మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ కావడం విశేషం…
Also Read: తమ్ముడు సినిమా ‘సెన్సార్’ రివ్యూ వచ్చేసింది.. : టాక్ ఎలా ఉందంటే?
పాండురంగడు, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలతో రాముడిగా, కృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇకమీదట కూడా ఆయన ఇంకా కొన్ని పౌరాణిక పాత్రల్ని పోషించడానికి తను ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య బాబు కి తెలుగు భాష మీద హిందూ సంస్కృతి మీద చాలా గౌరవం ఉంటుంది.
అందువల్లే ఆయన హిందూ దేవుళ్లను గౌరవిస్తూ దేవుడికి సంభందించిన కథ దొరికినప్పుడు ఆ సినిమాను చేయడమే కాకుండా అందులో ఒదిగిపోయి నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అందుకే నందమూరి బాలకృష్ణ కు వాళ్ళ నాన్న ఎన్టీఆర్ తర్వాత అంత మంచి గుర్తింపు అయితే లభించింది…చిరంజీవి లాంటి నటుడు సైతం శ్రీ మంజునాథ సినిమాలో శివుడి పాత్రలో నటించినప్పటికి ఆయనకు పెద్దగా గుర్తింపైతే రాలేదు.
Also Read: దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మూవీ..స్టోరీ లైన్ వింటే మెంటలెక్కపోతారు!
ఇంక నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాల్లో భక్తుడిగా నటించాడు. అంతే తప్ప దేవుడిగా నటించలేకపోయాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఈ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికైతే ఎన్టీఆర్ తర్వాత దేవుడి పాత్రలను చేసి మెప్పించిన హీరోల్లో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉండడం విశేషం…