Pudimadaka Fisherman: ఒక మత్స్యకారుడిని( fisherman ) సముద్రంలో చేప లాక్కొని పోయింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన.. అనకాపల్లి జిల్లాలో జరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. పెద్ద చేప వాళ్లకు చిక్కిందిలే అనుకొని సంబరపడుతుండగా.. ఆ చేపను చేజిక్కించుకునే క్రమంలో ఓ మత్స్యకార యువకుడు సముద్రంలో మునిగి గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడకకు చెందిన చౌడిపల్లి ఎర్రయ్య అనే యువకుడు.. గ్రామానికి చెందిన కొర్లయ్య, గనగల అప్పలరాజు, వాసుపల్లి ఎల్లాజీ అనే ముగ్గురితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. కానీ ఓ పెద్ద చేపను వల నుంచి తీసే క్రమంలో సముద్రంలో గల్లంతయ్యాడు
Also Read: పల్నాడు బాధితులు యూటర్న్.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు.. లోకేష్ చేయించాడట!
కొమ్ము కోనాం చేప వేటాడే క్రమంలో
సాధారణంగా సముద్ర తీరం నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాక చేపల వేట మొదలు పెడతారు. వీరు చేపల కోసం గాలం వేశారు. కొమ్ము కోనాం చేప చిక్కింది. దీని బరువు 100 కిలోల వరకు ఉంటుంది. పెద్ద చేప చిక్కింది అంటూ మత్స్యకారులు ఆనందపడ్డారు. ఎర్రయ్య ( Yaariyan) తాడుతో ఆ చేపను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు ఎర్రయ్య తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఎర్రయ్యను చేప బలంగా సముద్రంలోకి లాగేసింది. పడవ నుంచి ఎర్రయ్య నీళ్లలోకి పడిపోయాడు. తోటి మత్స్యకారులు చూస్తుండగానే సముద్రంలో గల్లంతయ్యాడు.
Also Read: హాట్ టాపిక్ : జగన్ పై వాహన ప్రమాద కేసులో చర్యలన్నీ నిలిపేసిన కోర్టు
ఆచూకీ దొరకలే
గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సమాచారం అందడంతో వారు పడవలతో వెతుకులాటకు బయలుదేరారు. గల్లంతైన చోట సముద్రంలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. ఎర్రయ్య ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పడవ ప్రమాదాల్లో చనిపోవడం పరిపాటిగా మారింది. కానీ వేటాడుతుండగా ఓ చేప లాక్కొని వెళ్లడం మాత్రం విస్తు గొలుపుతోంది.