Prakashraj Comments : ఏంటా అవతారం? పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. గట్టిగానే తగులుకున్నారే

ఆది నుంచి ప్రకాష్ రాజ్ బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలాసార్లు కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే కామెంట్స్ పవన్ పై చేస్తున్నారు. అదే పనిగా సోషల్ మీడియాకు పని చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : September 26, 2024 6:38 pm

 Prakashraj Comments

Follow us on

Prakashraj Comments : ఏపీలో లడ్డూ వివాదం ప్రకంపనలను సృష్టిస్తోంది. రాజకీయాలనే షేక్ చేస్తోంది. అయితే దీనిపై చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎంటర్ అయ్యేసరికి పరిస్థితి మారింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్టు పరిస్థితి మారింది.తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ట్విట్ చేశారు. అప్పటినుంచి ప్రకాష్ రాజ్ పవన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. దీంతో వారి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ వ్యవస్థ కోసం ప్రస్తావించేసరికి.. ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది.. దయచేసి దర్యాప్తు చేయండి. దోషులను కనుగొని కట్టిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింప చేస్తున్నారు అంటూ పవన్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దీనిని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని నిలదీశారు. దేశంలో మనకు తగినంత మత్తపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని గుర్తు చేశారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి సైతం కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరిగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరిగింది.

* పవన్ స్ట్రాంగ్ రియాక్షన్
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు లడ్డు వివాదంతో ప్రకాష్ రాజ్ కు పని ఏంటని ప్రశ్నించారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని.. అటువంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదం పై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అయితే వెంటనే ప్రకాష్ రాజ్ దీనిపై స్పందించారు. వెనక్కి తగ్గినట్లు కనిపించారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని.. ఈనెల 30న దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత ప్రతి మాటకు సమాధానం చెబుతానని తేల్చి చెప్పారు. నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ ను ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకోవాలని సెటైరికల్ గా మాట్లాడారు.

* బలవంతపు క్షమాపణలా
అంతటితో ఆగని ప్రకాష్ రాజ్ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తమిళ హీరో కార్తీ చేత బలవంతంగా క్షమాపణ ఎందుకు చెప్పించారని నిలదీశారు. సత్యం సుందరం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు హీరో కార్తీ. లడ్డు కావాలా నాయనా అంటూ యాంకర్ అడగడం.. దీనిపై కార్తీ స్పందిస్తూ.. లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ మేటర్ అని.. దానికోసం మాట్లాడకూడదు అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హీరోలు అలా మాట్లాడకూడదు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కార్తీ.. ఆయనకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. దీనిపై స్పందించారు ప్రకాష్ రాజ్. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ మరోసారి ప్రకాష్ రాజ్ ట్విట్ చేశారు.

* తాజాగా సరికొత్త ట్విస్ట్
అసలు ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ప్రకాష్ రాజ్ లేరు. ఇంకా ఈ వివాదాన్ని తవ్వుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఈసారి గట్టిగానే పవన్ కళ్యాణ్ కు నేరుగా తాకేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.’ గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకి అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ మరోసారి ప్రకాష్ రాజ్ ట్విట్ చేశారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. మొత్తానికి అయితే ఈ వివాదాన్ని ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రకాష్ రాజ్ లేరు. కేవలం బిజెపి పై ఉన్న కోపంతోనే ప్రకాష్ రాజ్ ఇలా పవన్ కళ్యాణ్ ను తగులుకున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.