Samantha Mobbed: ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రంలోని ‘సహానా..సహానా’ పాట లాంచ్ కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని లుల్లూ మాల్ కి వచ్చిన ఆ చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్, ఈవెంట్ ని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఆమెని చుట్టుముట్టడం, ఆ క్రమం లో జరిగిన తోపులాట లో నిధి అగర్వాల్(Nidhi Agarwal) నలిగిపోవడం, ఆమె ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి రేంజ్ కి రావడం వంటివి మనమంతా చూసాము. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యింది. ఒక ఆడపిల్ల జనం మధ్యలోకి వెళ్తే ఇలాంటి పనులు చేస్తారా?, ఇలాంటి అల్లరి మూకని కఠినంగా శిక్షించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ సమంత విషయం లో కూడా ఇదే ఘటన రిపీట్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నేడు జూబ్లీ హిల్స్ లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నది. కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయం లో అభిమానులు ఒక్కసారి సమంత మీదకు దూసుకొచ్చారు. కొద్దిగా లో తొక్కిసలాట ఘటన జరిగేది. సమంత వాళ్ళ మధ్య లో చిక్కుకొని పోయింది, ఆమెకు ఊపిరి ఆడనంత పని అయ్యింది. తన వ్యక్తిగత సిబ్బంది అతి కష్టం మీద ఆమెని ఆ అభిమానుల సమూహం నుండి బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్, అభిమానం పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు గా?, విచక్షణ కోల్పోయి ఈమధ్య కాలం లో ఇలా ప్రవర్తిస్తున్నారేంటి?, పొరపాటు ఎక్కడ జరుగుతుంది? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినీ తారాలు జనాల్లోకి వచ్చినప్పుడు వారిని చూసేందుకు అభిమానులు ఎగబడడం సర్వసాధారణమే. కానీ ఆ జనాలను కంట్రోల్ చేసే బాధ్యత కచ్చితంగా ఈవెంట్ నిర్వాహకులు మరియు పోలీసులదే. ఇక్కడే ఎక్కడో లోపం జరుగుతుంది అనేది విశ్లేషకుల వాదన. గతం లో సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు ఎదురుకోలేదు. కానీ ఇప్పుడు వారం గడవకముందే రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది పోలీస్ యంత్రాంగానికి ఒక వార్నింగ్ బెల్ లాంటిది అనుకోవచ్చు. మరోసారి ఇలాంటి ఘటన జరిగి అనర్దానికి దారి తీసేలోపు సరైన చర్యలు తీసుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.