https://oktelugu.com/

Shivaji: బిగ్ బాస్ తర్వాత మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టిన శివాజీ ..ఈసారి ఏకంగా ఆ స్టార్ హీరోయిన్ తో!

శివాజీ కి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు తన స్వరాన్ని వినిపించే శివాజీ, ఈ ఎన్నికలలో కూటమికి తన సప్పోర్టుని ఇచ్చి, గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. అలా శివాజీ ముట్టుకున్న ప్రతీ ఒక్కటి బంగారం లాగా మారిపోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 01:25 PM IST

    Shivaji

    Follow us on

    Shivaji: హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీ, బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, ఒక ఆర్టిస్టుగా సాధించని క్రేజ్ ని, ఫాలోయింగ్ ని బిగ్ బాస్ షో ద్వారా సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. శివాజీ ఇంత మాస్టర్ మైండ్ గా గేమ్స్ ఆడుతాడని, ఆయనలో ఈ రేంజ్ టాలెంట్ ఉందని ఆడియన్స్ కి బిగ్ బాస్ లో చూసేవరకు ఆడియన్స్ కి తెలియదు. మంచి నటుడు అనే పేరు ఆయన సినిమా ద్వారా సంపాదించుకున్నాడు కానీ, జనాలకు బాగా దగ్గరైంది మాత్రం బిగ్ బాస్ ద్వారానే. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వెంటనే, ఆయన హీరో గా నటించిన ’90s ‘ అనే వెబ్ సిరీస్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కారణంగా ఆ యాప్ రేంజ్ మారిపోయింది.

    అలా శివాజీ కి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు తన స్వరాన్ని వినిపించే శివాజీ, ఈ ఎన్నికలలో కూటమికి తన సప్పోర్టుని ఇచ్చి, గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. అలా శివాజీ ముట్టుకున్న ప్రతీ ఒక్కటి బంగారం లాగా మారిపోతుంది. సినిమాల్లోకి కూడా ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ రెండు , మూడు ప్రాజెక్ట్స్ చెయ్యడానికి సంతకం కూడా చేసాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన హీరో గా ఒక చిత్రం మొదలైంది. శివాజీ ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే అవ్వడం విశేషం. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా లయ నటిస్తుంది. చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన లయ, అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి యాక్టీవ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె ఇండియాకి వచ్చి చాలా రోజులైంది, పలు ఇంటర్వ్యూస్ కూడా ఈమధ్య కాలం లో ఇచ్చింది.

    ఇప్పుడు శివాజీ చిత్రం ద్వారా మళ్ళీ ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మిస్సమ్మ’, ‘టాటాబిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఈమధ్యనే ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తం షాట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇవ్వగా, మాస్ డైరెక్టర్ మొదటి షాట్ కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా సుధీర్ శ్రీరామ్ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పనిచెయ్యబోతున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శివాజీ కి మంచి కం బ్యాక్ మూవీ అవుతుందో లేదో చూడాలి.