Puri Jagannadh Shock To Bandla Ganesh: ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఒక మార్క్ ఉంది. మైక్ దొరికితే పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు అని, నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేస్తాడు అని.. బండ్ల పై బలమైన మార్క్ ఉంది. దానికి తగ్గట్టుగానే బండ్ల కూడా తన పైత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి “చోర్ బజార్” సినిమా ఆడియో ఫంక్షన్ లో నోటికొచ్చినట్లు వాగేశాడు బండ్ల. పూరి భార్య ‘లావణ్య’ను వదిన అని పిలుస్తూ.. పూరి పై విమర్శలు చేశాడు.

‘ఎవర్నో సూపర్ స్టార్స్ ను చేశావు.. ఇప్పుడు నీ సొంత కొడుకును ఎందుకు వదిలేశావ్ ? నీ కొడుకు సినిమా కోసం రాకుండా ముంబైలో ఏం చేస్తున్నావు ?’ అంటూ బండ్ల గణేష్.. పూరిని ప్రశ్నిస్తూ ఛార్మితో పూరి ఎఫైర్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే, బండ్ల గణేష్ పై పూరి పరోక్షంగా స్పందిస్తూ ‘టంగ్’ అనే పేరుతో ఒక ఆడియో వదిలాడు.
పూరి మాటల్లోనే.. ‘గుర్తు పెట్టుకోండి.. మన నాలుకు కదులుతున్నంత సేపూ.. మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువ సేపు మనం వింటూ ఉండాలి. అదే మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, మీ ఫ్రెండ్స్ కావొచ్చు, ఆఫీస్ మెంబర్స్ కావొచ్చు.. ఆకరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్ గా ప్రవర్తించొద్దు, మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది.

మీరు వినే ఉంటారు సుమతీ శతకం. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ అని. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. చివరగా ఒక మాట.. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది’ అని పూరి జగన్నాథ్ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. అయితే, పూరి చెప్పిన ఈ మాటలు కేవలం బండ్ల గణేష్ ను ఉద్దేశించి మాట్లాడివనే అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. అయినా బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఏమి బాగాలేదు. పూరి గురించి తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పూరి తన కొడుకుని పట్టించుకోవడం లేదు అని కామెంట్స్ చేయడం భావ్యం కాదు. నిజానికి పూరి తన కొడుకు కోసం సొంతంగా రెండు సినిమాలను నిర్మించాడు. అలాగే కొడుకుతో ఒక ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు. అయినా బండ్ల గణేష్ ఇలా ఆలోచించకుండా మాట్లాడటం విచిత్రమే.
[…] Also Read: Puri Jagannadh Shock To Bandla Ganesh: చార్మితో ఎఫైర్: బండ్ల గ… […]