Telangana Intermediate Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఇన్నాళ్లు సందిగ్దం ఏర్పడింది. ఎట్టకేలకు ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు అంగీకారం తెలిపింది. దీంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో పరీక్షలు జరపకుండానే ఫలితాలు ప్రకటించిన ఇంటర్ బోర్డు ఈ సారి ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 28న ఫలితాలు వెల్లడించేందుకు సమయం కేటాయించింది. దీంతో విద్యార్థులు ఆతృతతో చూస్తున్నారు. తాము కష్టపడి రాసిన ఫలితాలు వస్తాయనే దీమాతో ఎదురు చూస్తున్నారు. తరువాత చదివే కోర్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఫలితాల ప్రకటనకు బోర్డు ఊగిసలాడింది. ఇచ్చిన సమయం ప్రకారం ఫలితాలు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందులపై సమాలోచనలు చేశారు. విద్యార్థులకు సమయం ఇచ్చి తరువాత ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఇన్నాళ్లు తేదీలు ఖరారు చేయలేదు. కానీ విద్యార్థుల డిమాండ్ తో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. ఫలితాల వెల్లడికి సమయం ఇచ్చి దాని ప్రకారమే ఫలితాలు విడుదల చేయాలని భావించింది. దీని కోసమే ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
రేపు ఫలితాలు ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకతతో ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేసి విద్యార్థుల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తోంది. ఫలితాల వెల్లడిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతోనే రేపటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఈ వెబ్ సైట్లలో చూసుకుని నిర్ధారించుకోవాల్సిందిగా సూచించింది. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఏవైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డును సంప్రదించాలని కోరింది. https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in ఈ మేరకు ఫలితాలు వచ్చిన తరువాత ఎవరికైనా మార్కుల విషయంలో అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో విద్యార్థులు తమ మార్కుల విషయంలో ఎవరి మాటలు నమ్మొద్దని చెప్పింది.
ఇంటర్ ఫలితాలపై విద్యార్థులకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే ఇదివరకు జరిగిన సంఘటనల ఆధారంగానే బోర్డు తీరుపై విద్యార్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల వల్ల ప్రస్తుతం కూడా అలాంటి తప్పిదాలేమైనా చోటుచేసుకుంటాయోమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు మాత్రం ఎలాంటి తప్పిదాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెబుతోంది. మొత్తానికి విద్యార్థులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తుందో లేదో చూడాల్సిందే.
Also Read: TRS Party: ఈ ‘కారు’లో మేము ప్రయాణించలేం? టీఆర్ఎస్ లో తిరుగుబాట్లు.. మహారాష్ట్ర గతేనా?
[…] Read: Telangana Intermediate Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై… … టీఎస్ హెచ్ఐసీ ఏర్పాటు చేసినా … […]