Advance Ticket Bookings: ఆరేళ్ళ క్రితం మొదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని సెంటర్స్ లో మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా పైడ్ ప్రీమియర్ షోస్ కి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని పెంచుకోవడానికి, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలకు ముందు రోజే పైడ్ ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో మొదలు పెట్టడం ప్రారంభించారు. పైడ్ ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ 600 రూపాయిల వరకు పెట్టారు.
Also Read: హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో క్రిష్ ఎక్కడ..? ఇంత అన్యాయమా?
దీంతో టిక్కెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఒక్క కాకినాడ ప్రాంతం లోనే దాదాపుగా 22 థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ ని వేస్తున్నారట. ఇప్పటికే అందులో 10 కి పైగా షోస్ ని ఆన్లైన్ లో పెట్టగా, అవి నిమిషాల వ్యవధిలోనే ఫుల్ అయిపోయాయి. ఆరేళ్ళ క్రితం మొదలైన సినిమాకు ఇప్పుడేమి డిమాండ్ ఉంటుంది?, అనవసరంగా ప్రీమియర్ షోస్ వేసుకుంటున్నారు, చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అని చాలా మంది అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు అలాంటివి వర్తించవు అనేది గుర్తించలేకపోయారు. ఫలితం గా ఇప్పుడు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి పైడ్ ప్రీమియర్ షోస్ నుండి ఇండియా వైడ్ గా మొత్తం కలిపి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇదే ఆల్ టైం రికార్డు అట. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆ రికార్డు ని బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read:ఆలీ తండ్రిది ఇండియా కాదా? వెలుగులోకి షాకింగ్ నిజం
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మళ్ళీ ఈ రికార్డుని కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికే సాధ్యం అవుతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా రాజమౌళి లేదా ఎన్టీఆర్ లకు ఈ సినిమా రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. ప్రీమియర్స్ సంగతి సరే సరి, కానీ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ని అభిమానులు పట్టించుకుంటారో లేదో అనే టెన్షన్ కూడా బయ్యర్స్ లో ఉంది. ఎందుకంటే అందరు ప్రీమియర్ షోస్ మీదనే అమితాసక్తిని చూపిస్తున్నారు. ఇది మొదటి రోజు ఓపెనింగ్ పై ప్రభావం చూపిస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.