https://oktelugu.com/

Amaran Movie Advance Bookings : గంటకి 30 వేల టికెట్స్..’దేవర’ ని మించిపోయిన శివ కార్తికేయన్ ‘అమరన్’ అడ్వాన్స్ బుకింగ్స్!

కోలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా పిలవబడే శివ కార్తికేయన్ కి ఇంత స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఏంటి?, తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన అభిమానులు మొత్తం శివ కార్తికేయన్ కి షిఫ్ట్ అయిపోయారా?, అందుకే ఈ స్థాయి ఓపెనింగ్ వచ్చిందా అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

Written By:
  • Vicky
  • , Updated On : October 30, 2024 6:45 pm
    Amaran Movie Advance Bookings

    Amaran Movie Advance Bookings

    Follow us on

    Amaran Movie Advance Bookings : దీపావళి సందర్భంగా రేపు కిరణ్ అబ్బవరం ‘క’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, ‘భగీర’ మరియు శివ కార్తికేయన్ ‘అమరన్’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. వీటిల్లో కచ్చితంగా ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉంటాయి, ఆ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ ని సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మంచి క్రేజ్ ఉండడం, దానికి తోడు రీసెంట్ గా ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడం వల్ల ట్రేడ్ ఇలాంటి అంచనా వేసింది. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ శివ కార్తికేయన్ ‘అమరన్’ చిత్రానికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    కేవలం A సెంటర్స్ లోనే కాకుండా బి,సి సెంటర్స్ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండడం గమనార్హం. ఎందుకంటే తమిళ టైటిల్ ని తెలుగులో పెట్టారు కాబట్టి, ఆడియన్స్ కి పెద్దగా రీచ్ అవ్వదు, ఓపెనింగ్స్ రావని అనుకున్నారు. పైగా శివ కార్తికేయన్ తెలుగు లో అంత పాపులర్ హీరో కూడా కాదు. అయినప్పటికీ ఇంత అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి కారణం ఈ చిత్రం మేజర్ వరదరాజన్ బయోపిక్ అవ్వడం వల్లే. ఈరోజు ఉదయం ఈ చిత్రానికి బుక్ మై షో టికెట్ సేల్స్ పోర్టల్ యాప్ లో గంటకు 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. విడుదలకు ముందు ‘దేవర’ చిత్రానికి కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి మాత్రమే ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల ముందు రోజు ఉదయం జరిగింది. ఆ తర్వాత ‘అమరన్’ చిత్రానికి మాత్రమే జరగడం గమనార్హం. శివ కార్తికేయన్ గత చిత్రాలకు ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అలాగే కమర్షియల్ గా కూడా ఆ సినిమాలు ఫుల్ రన్ లో ఫ్లాప్స్ గా నిలిచాయి.

    కోలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోగా పిలవబడే శివ కార్తికేయన్ కి ఇంత స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఏంటి?, తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన అభిమానులు మొత్తం శివ కార్తికేయన్ కి షిఫ్ట్ అయిపోయారా?, అందుకే ఈ స్థాయి ఓపెనింగ్ వచ్చిందా అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. టాక్ పాజిటివ్ వస్తే ఇంకా ఎక్కువే రావొచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. రీసెంట్ గా విడుదలైన రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రానికి మొదటి రోజు 69 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ‘అమరన్’ చిత్రానికి ఇంచుమించు అంతే ఓపెనింగ్స్ పాజిటివ్ టాక్ మీద రావొచ్చు.