https://oktelugu.com/

Manoj Muntashir : బహిరంగ క్షమాపణలు కోరిన ఆదిపురుష్ రైటర్… ఇప్పటికి తెలిసిందా చేసిన తప్పు!

మనోజ్ ముంతాశిర్ ఆదిపురుష్ చిత్ర రచయితగా ఉన్నారు. ఆదిపురుష్ మూవీ మీ మనోభావాలను దెబ్బతీసిందని నేను నమ్ముతున్నాను. అందుకే నేను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. నన్ను క్షమించండి. భగవాన్ బజరంగ్ బలి మనల్ని ఐక్యం చేసి సనాతన ధర్మాన్ని కాపాడుకునే శక్తిని ఇవ్వాలి, అని ట్వీట్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2023 10:30 am
    Follow us on

    Manoj Muntashir : మతం, దైవం, సాంప్రదాయలను టచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి చాలా సున్నితమైన విషయాలు. మనకు ఇష్టం వచ్చినట్లు చూపిస్తే, మాట్లాడితే జనాలు హర్షించరు. ఆదిపురుష్ విషయంలో అదే జరిగింది. మోడరన్ రామాయణ పేరుతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ తీవ్ర విమర్శల పాలైంది. రాముడు, రావణాసురుడు పాత్రలను కొత్తగా డిజైన్ చేశాడు. కొన్ని సన్నివేశాలైతే రామాయణంతో అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. ఆదిపురుష్ చూసిన ఆడియన్స్ ఇది అసలు రామాయణమేనా అనే సందేహం వ్యక్తం చేశారు. 

     
    ఇక దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. కోర్టులు సైతం సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని మండిపడ్డాయి. సామాన్యులు, చిత్ర ప్రముఖులు, హిందూవాదులు ఆదిపురుష్ చిత్రాన్ని తప్పుబట్టారు. చిత్ర యూనిట్ కొంత మేర సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు ఆదిపురుష్ రచయిత రియలైజ్ అయ్యాడు. దేశానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన సోషల్ మీడియాలో ఈ మేరకు సందేశం పోస్ట్ చేశారు. 
     
    మనోజ్ ముంతాశిర్ ఆదిపురుష్ చిత్ర రచయితగా ఉన్నారు. ఆదిపురుష్ మూవీ మీ మనోభావాలను దెబ్బతీసిందని నేను నమ్ముతున్నాను. అందుకే నేను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. నన్ను క్షమించండి. భగవాన్ బజరంగ్ బలి మనల్ని ఐక్యం చేసి సనాతన ధర్మాన్ని కాపాడుకునే శక్తిని ఇవ్వాలి, అని ట్వీట్ చేశారు. మనోజ్ ముంతాశిర్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఆదిపురుష్ మూవీలో డైలాగ్స్ సైతం తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఒక పౌరాణిక చిత్రానికి డైలాగ్స్ రాసే తీరు అదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
     
    ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఈ చిత్రంలో జానకిగా కృతి సనన్ చేశారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. ఆదిపురుష్ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ నాలుగు వందల కోట్ల వరకు వసూలు చేసింది. అంటే చిత్ర బడ్జెట్ కూడా రికవర్ కాలేదు. చెప్పాలంటే నిర్మాతలకు, బయ్యర్లకు పెద్ద మొత్తంలో నష్టాలు ఏర్పడ్డాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి వరుసగా మూడో ప్లాప్ పడిందని చెప్పొచ్చు.