https://oktelugu.com/

Adipurush OTT: సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైన ఆదిపురుష్… ఎక్కడ చూడొచ్చంటే!

వివాదాల మధ్య కూడా ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే లాంగ్ రన్ నిలబడలేకపోయింది. ఆదిపురుష్ కోట్ల నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ కి వరుసగా మూడో ప్లాప్ పడింది.

Written By:
  • Shiva
  • , Updated On : August 11, 2023 / 08:44 AM IST

    Adipurush OTT

    Follow us on

    Adipurush OTT: ప్రభాస్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్. దర్శకుడు ఓం రౌత్ రామాయణగాథగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేయగా జానకిగా కృతి సనన్ నటించింది. ఆదిపురుష్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మూవీ అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆధునిక రామాయణం పేరుతో ఓం రౌత్ పురాణ పాత్రలు, రామాయణ సన్నివేశాలు కూడా మార్చేశాడు. కొన్ని డైలాగ్స్ దారుణంగా ఉన్నాయన్న మాట వినిపించింది. ఈ చిత్రానికి రచయితగా పని చేసిన మనోజ్ ముంతాషీర్ క్షమాపణలు చెప్పారు.

    వివాదాల మధ్య కూడా ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే లాంగ్ రన్ నిలబడలేకపోయింది. ఆదిపురుష్ కోట్ల నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ కి వరుసగా మూడో ప్లాప్ పడింది. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ హిట్ దక్కలేదు. ఆదిపురుష్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది.

    జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ కొన్ని కారణాలతో లేటుగా ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగా ప్లాప్ మూవీస్ నాలుగు వారాలకు ముందే ఓటీటీలో వచ్చేస్తాయి. ఆదిపురుష్ మూవీ థియేటరికల్ రన్ ముగిసి చాలా కాలం అవుతున్నా ఓటీటీలో రాలేదు. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఆగస్టు 11 నుండి ఆదిపురుష్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

    బడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో ఆదిపురుష్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు తమ ఇంట్లో ప్రశాంతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశారు. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే బడ్జెట్ రీత్యా పెద్ద మొత్తంలో నష్టాలు మిగిలాయి. దర్శకుడు ఓం రౌత్ విమర్శలపాలయ్యాడు.