https://oktelugu.com/

Aadipurush 1st Day Collection : ‘ఆదిపురుష్’ మొదటి రోజు వసూళ్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ కలెక్షన్స్ కలలో కూడా ఊహించలేదు!

అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే చాలా యావరేజి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : June 17, 2023 / 10:06 AM IST
    Follow us on

    Aadipurush 1st Day Collection : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం బాషలలో గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ముందుగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల ఈ చిత్రానికి నైజాం వంటి ప్రాంతాలలో మంచి ఓపెనింగ్ దక్కింది, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అతి తక్కువ రేట్స్ మీద విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం కంటే చాలా చోట్ల తక్కువ వసూళ్లు వచ్చాయి.

    ఇది అభిమానులు సైతం ఊహించలేకపోయారు, నిన్న ట్రేడ్ పండితులు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయిలు కొల్లగొట్టబోతుంది అని అంచనాలు వేసేలోపు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. హిందీ లో బంపర్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ తెలుగు లో మాత్రం సినిమా బడ్జెట్ కి వచ్చిన వసూళ్లకు సంబంధమే లేదు, ఒక్కసారి ఈ సినిమాకి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

    ఈ సినిమాకి రాయలసీమ వంటి ప్రాంతం లో కేవలం మూడు కోట్ల 45 లక్షల రూపాయిల ఓపెనింగ్ మాత్రమే దక్కింది. ప్రభాస్ నటించిన గత చిత్రం ‘రాధే శ్యామ్’ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మార్నింగ్ షోస్ నుండే ఈ సినిమాకి డ్రాప్స్ రావడం తో ఇంత తక్కువ ఓపెనింగ్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 32 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 68 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 95 లక్షలు , నెల్లూరు జిల్లాలో 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది. అలాగే గుంటూరు జిల్లా లెక్కలు చూస్తే 4 కోట్ల రూపాయిల షేర్ వచ్చిందని అంచనా వేస్తున్నారు.

    ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రాన్ని బయ్యర్స్ 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు , కానీ మొదటి రోజు కేవలం 18 కోట్లు మాత్రమే వచ్చింది, ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా వర్కింగ్ డేస్ లో మంచి వసూళ్లను రాబట్టాలి, ఇక తెలంగాణ లో ఈ చిత్రానికి మొదటి రోజు 13 కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అంచనా, అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే చాలా యావరేజి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.