Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఈ నెల 16 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ మరియు పాటలు ఇండియా మొత్తాన్ని ఊపేస్తున్నాయి. ఈమధ్య కాలం లో ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఈ రేంజ్ హైప్ ని తెచ్చుకున్న ఇండియన్ సినిమా లేదు.
టీజర్ అప్పుడు అసలు ఇదేమి కార్టూన్ బొమ్మల సినిమా అని అందరూ అనుకున్నారు. ఫ్యాన్స్ సైతం ఈ చిత్రం పై ఆశలు వదిలేసుకున్నారు. కానీ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాని ఈ నెల కి వాయిదా వేసి, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేసి, సినిమాని అదిరిపోయే రేంజ్ క్వాలిటీ కి తీసుకొచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం ఇంతలా ఎదురు చూసేందుకు కారణం కూడా మేకర్స్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ ఇండియా లో ప్రారంభం అయ్యాయి.కేవలం 24 గంటల్లోనే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు, ఇక ఫ్యాన్స్ మొత్తం తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం లోపే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు గాను దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకి ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ పై పది రోజుల పాటుగా 50 రూపాయిలు పెంచుకోవచ్చు, ఇక తెలంగాణ లో వంద రూపాయిలు హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనితో పాటు మేకర్స్ ఆదిపురుష్ టికెట్స్ ఫ్రీ క్యాంపైన్ కూడా జనాలకు బాగా రీచ్ అయ్యింది.