Lavanya Tripathi: నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలు అయ్యారు. వరుణ్ తేజ్ భార్యగా నాగబాబు ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తో పాటు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. వివాహం మాత్రం చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా చేయనున్నారట.
వరుణ్ తేజ్-లావణ్యల వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఐదేళ్లకు పైగా లావణ్య, వరుణ్ ప్రేమించుకుంటున్నారని సమాచారం. వీరి రిలేషన్ బయటకు తెలియదు. కేవలం రెండేళ్ల క్రితం నుండి వీరి ప్రేమ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. లావణ్య త్రిపాఠి ఒకటి రెండు సందర్భాల్లో వరుణ్ తో పెళ్లి వార్తలు ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటించి షాక్ ఇచ్చారు.
లావణ్య త్రిపాఠికి నాగబాబుతో పాటు టాప్ స్టార్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మామయ్యలు అయ్యారు. కాగా ఓ సందర్భంలో లావణ్య త్రిపాఠిని యాంకర్ సుమ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరితో నటించాలని కోరుకుంటారని అడగ్గా… ఆమె ఒకింత ఆసక్తికర సమాధానం చెప్పారు. చిరంజీవి పెద్దవారు, ఆయన టాప్ స్టార్స్. కాబట్టి చిరంజీవితో మూవీ చేయాలనుకుంటున్నాను, అన్నారు. ఆ విధంగా పెద్దమామయ్య చిరంజీవితో నటించాలన్న కోరిక భయపెట్టింది.
కాగా లావణ్య త్రిపాఠి కెరీర్ నెమ్మదించింది. వరుస పరాజయాలతో చతికిలపడింది. ఆమె లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే చిత్రాలు పరాజయం పొందాయి. పులి మేక పేరుతో వెబ్ సిరీస్ చేయగా అది కూడా నిరాశపరిచింది. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అందాల రాక్షసి మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టిన లావణ్య టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.