Adi Pinishetty: సినీ కెరీర్లో తనకంటూ ఎలాంటి పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. స్వతహగా నిలదొక్కుకుంటూ పైకి ఎదిగి హీరో, విలన్, ఇలా ఏపాత్ర దొరికితే అందులో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నటుడు ఆది పనిశెట్టి. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన సత్తా చూపించి ఏ పాత్రకైనా రెడీ అనేట్లుగా తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. కాగా, ఈరోజు ఆది పినిశెట్టి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం.

డిసెంబరు 14 ,1982న జన్మించారు. రవిరాజా పినిశెట్టి, రాధారాణి ఆది తల్లిదండ్రులు. ఆది తండ్రి రవిరాజా 40కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు, బంగారు బుల్లోడు, చంటి, పెదరాయుడు, మా అన్నయ్య వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన వ్యక్తి రవిరాజా. ఆయన బాటలోనే పెద్దకొడుకు సత్య ప్రభాస్ దర్శకుడిగా మారారు. అయితే, చిన్నబ్బాయి ఆది మాత్రం నటనపై ఉన్న మ్కువతో నటనవైపు అడుగులేశారు. ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో వచ్చిన వి చిత్రం ద్వారా ఆది నటనలో ప్రవేశించారు. తర్వాత తమిళ సినిమాల్లో మెరవగా.. తెలుగులో గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, అజ్ఞాతవాసి, రంగస్థలం, యూ టర్న్, నీవెవరో వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు.
కాగా, ప్రస్తుతం కీర్తి సురేశ్‌తో కలిసి గుడ్‌లక్ సఖిలో నటించారు డిసెంబరు 31న ఈ సినిమా విడుదల కానుంది. క్లాప్ అనే సినిమాలోనూ, లింగుస్వామి దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమాలోనూ ఆది నటిస్తున్నారు.