Heroines: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేపుతోంది. నిత్యం జనాల్లో ఉండే సెలబ్రెటీలు కరోనా నిబంధనలను తుంగలో తొక్కతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా ఎంట్రీ ఇచ్చాక చాలామంది సెలబ్రెటీలు ఈ మహమ్మరి బారినపడి కోలుకోగా పలువురు మృత్యువాత పడిన ఘటనలున్నాయి.
సెలబ్రెటీలు ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా షూటింగ్స్, తదితర ఫంక్షన్లలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించక పోవడమే వీరికి కరోనా సోకడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లకు కరోనా పాజిటీవ్ రాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో వీరి ఆరోగ్యంపై అభిమానులు కలవరం చెందుతున్నారు. సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతుండటం సినిమా ఇండస్ట్రీపై భారీగానే ప్రభావం చూపుతోంది.
లేటెస్టుగా బాలీవుడ్ హీరోయిన్స్ కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరాకు కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో వీరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కాగా వీరిద్ధరూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పేర్కొంది. వీరిద్దరూ కలిసి పార్టీలకు హాజరయ్యారని.. వీరిని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అయితే వీరికి ఒమిక్రాన్ వేరియంట్ ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
అదేవిధంగా టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నట్లుండి అస్వస్థతకు గురైంది. కొద్దిరోజులుగా ఆమె జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతోంది. దీంతో ఆమె ఏఐజీ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుని విశ్రాంతితోపాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమంతకు కరోనా సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. సమంత కరోనా పాజిటివ్ రాలేదని.. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ట్వీట్ చేశారు.
Also Read: సిల్వర్‌స్క్రీన్‌పై కొడుకులతో సీనియర్ హీరోలు.. వెరీ స్పెషల్ మూవీస్
కాగా సమంత రీసెంట్ గా కడపలోని మాంగళ్య షాపింగ్ మాల్ 11వ షోరూమ్ ప్రారంభానికి హాజరైంది.సమంతతోపాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమంతను చూసేందుకు అభిమానులు వేలాదిగా అక్కడికి తరలివచ్చారు. కాగా కరోనాకు పాజిటివ్ రాలేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే కరీనా కపూర్, అరోరా పలు సినిమాల షూటింగుల్లో పాల్గొనడంతో వారితో నటించిన నటీనటులంతా ప్రస్తుతం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. ఏదిఏమైనా కరోనా నిబంధనలన్నీ సామాన్యులకేనా.. సినీ, రాజకీయ సెలబ్రెటీలకు వర్తించవా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read: ‘ఊ అంటావా మావ’ పాటకు అరియానా స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్