Homeఎంటర్టైన్మెంట్Adbhutam: హాట్​స్టార్​ వేదికగా 'అద్భుతం' జరిగేదెప్పుడంటే!

Adbhutam: హాట్​స్టార్​ వేదికగా ‘అద్భుతం’ జరిగేదెప్పుడంటే!

Adbhutam: జాంబి రెడ్డి సినిమాతో యంగ్​ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన హీరో తేజ సజ్జా. ప్రస్తుతం తేజ హీరోగా మల్లిక్​ రామ్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అద్భుతం. ఈ సినిమాను చంద్రశేఖర్​ మొగుళ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్​, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్​గా తెలుగు తెరకు పరిచయం కానుంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్​గా ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, ఆమె నటించబోతున్న సినిమాల్లో తొలి సినిమా అద్భతం కావడం విశేషం.

adbhutam-movie-is-going-to-release-at-hotstar

ప్రసాంత్ వర్మ కథ, మల్లిక్​ రామ్​ దర్శకత్వం ప్రతిభ, తేజ సజ్జ నటన, శివాని అందచందాలతో అద్భుతం సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని నిర్మాత చంద్రశేఖర్​ అంటున్నారు. మరోవైపు, మిర్చి కిరణ్​, తులసి, శివాజీ రాజా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాథన్ సంగీతం అందిస్తుండంగా.. ఈ నెల 19న డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదలకు సిద్ధమైంది.

ఇటీవల కాలంలో దాదాపు చిన్న, పెద్ద సినిమాలన్నీ ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నాయి. పెద్ద హీరోలు కూడా థియేటర్లకంటే ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లోనే సినిమాలను విడుదల చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే అద్భుతం సినిమా కూడా ఓటీటీ వేదికైన హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. కాగా, తేజ తన చిన్నతనంలో చిరంజీవి, ఎన్టీఆర్​ వంటి స్టార్ హీరోలకు చిన్నప్పటి క్యారక్టర్​లో నటించిన విషయం తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular