Director Maruthi: బాహుబలి సినిమా గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ మాట ఇచ్చాడంటే ఏదైనా ఆ మాట కోడం ఎంత వరకు అయిన వెళ్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. బాహుబలి తర్వాత యంగ్ డైరెక్టర్ తో సాహో చేయడం అలానే ఇటీవల విడుదల అవుతున్న యంగ్ హీరోల సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఇవి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయ్యారు. అయితే దర్శకుడు మారుతితో ప్రభాస్ సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

యూవీ క్రియేషన్స్ అంటే మారుతికి సొంత సంస్థ లాంటిది. ఆయన గత సినిమాలలో కొన్నిటిని యూవీ సంస్థ నిర్మించింది. అలానే అవి మంకీ విజయం కూడా సాధించాయి. దాంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో ఎంత బడ్జెట్ పెట్టడానికైనా ఆ సంస్థ వెనుకాడదు. మారుతికి ప్రభాస్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో సినిమా జనాలు నిజమేమో అనుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయని… వాటిలో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని… తనకు కూడా ప్రభాస్ తో సినిమా తీయాలనుందని మంచి కథ దొరికితే కచ్చితంగా ఆయనకు చెప్తానని అన్నారు.