Homeఎంటర్టైన్మెంట్Adarsha Kutumbam Remake Rumors: 'ఆదర్శ కుటుంబం' ఆ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుందా..? అడ్డంగా...

Adarsha Kutumbam Remake Rumors: ‘ఆదర్శ కుటుంబం’ ఆ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుందా..? అడ్డంగా దొరికిపోయిన త్రివిక్రమ్..

Adarsha Kutumbam Remake Rumors: ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు , ఒరిజినల్ గా ఉండడం లేదు. పాత సినిమాలను రిఫరెన్స్ గా తీసుకొనే తెరకెక్కిస్తున్నాడు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ఆయన తీసిన చిత్రాలను చూస్తే అలాగే అనిపిస్తోంది. నితిన్ తో తీసిన ‘అ ..ఆ’ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పాత సినిమా ‘మీనా’ కి అనధికారిక రీమేక్. అందరికీ అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే ఫ్రీ మేక్ అనొచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘లార్గో వించ్ ‘ కి ఫ్రీ మేక్. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు అల్లు అర్జున్ తో చేసిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం కూడా అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన కృష్ణ ‘ఇంటిగుట్టు’ చిత్రానికి ఫ్రీ మేక్. ఇలా ఆయన పాత సినిమాలను రిఫరెన్స్ గా తీసుకొనే చేస్తూ వెళ్తున్నాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన విక్టరీ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈసారి ఆయన పాత సినిమాలను ఫ్రీ మేక్ చేయడం లేదు, గత నెలలో విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్ జోన్’ ని రీమేక్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. నిన్న గాక మొన్న విడుదలైన సినిమా అది, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం షూటింగ్ మొదలై నెలలు అవుతోంది, అలాంటిది రీమేక్ అని ఎలా పిలుస్తున్నారు , ఇదొక అర్థం లేని వాదన అని అనుకోవచ్చు. కానీ చెప్పలేం కదా, బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్టోరీ ని ఎవరో ఒకరి ద్వారా విని ఉండొచ్చు , అర్జున్ సినిమాని ఇప్పుడు ఎవరు చూస్తారు?, విడుదలయ్యాక పెద్దగా ఎవ్వరూ ఆ చిత్రాన్ని పట్టించుకోరు కాబట్టి , ధైర్యం గా అదే స్టోరీ తో ‘ఆదర్శ కుటుంబం ‘ చేస్తుండొచ్చు కదా అనేది కొంతమంది విశ్లేషకుల వాదన.

అనుకోకుండా ‘బ్లాస్ట్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం , త్వరలో ఓటీటీ లో కూడా రాబోతుండడంతో , ‘ఆదర్శ కుటుంబం’ విడుదల అయ్యాక పెద్ద సమస్య ఏర్పడుతుంది అనే విషయాన్నీ గమనించి , త్రివిక్రమ్ ఇప్పుడు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు , చేర్పులు చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో చూడాలి. ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చెయ్యాలి , కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version