https://oktelugu.com/

Photo Story: మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు ట్రెండీ హీరోయిన్.. ఈ పాప ఎవరో తెలుసా?

హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా ‘హార్ట్ ఎటాక్’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో సైడ్ పాత్రలు చేయడానికైనా ఒప్పుకుంది. సన్నాఫ్ సత్యమూర్తిలో ఈమె చిన్న పాత్రలో చూడొచ్చు. ఆ తరువాత అడవిశేషు తో ‘క్షణంతో కాస్త గుర్తింపు వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 12, 2023 / 04:01 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమాల్లోకి రాగానే స్టార్లు అయిపోరు. ఎంతో కృషి, పట్టుదలదో పాటు నటనా ప్రతిభ ఉండాలి. ఇవన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఎన్ని సినిమాల్లో నటించినా గుర్తింపు ఉండదు. అలా చాలా మంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ గుర్తింపు రాని వారు చాలా మందే ఉన్నారు. అయితే కొందరికి ఇలాంటి పరిస్థితి ఉన్నా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చిన వారు ఉన్నారు. అలా ఓ నటి సినిమాల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా.. ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీతో స్టార్ గా మారింది. ఆ సినిమా వివాదాల్లోకెళ్లడంతో ఈ అమ్మడు గురించి ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఎలాగోలా చదువును పూర్తి చేసిన ఈ భామ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.

    ఆ హాట్ బ్యూటీ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమెనే అందాల ఆదా శర్మ. 1992 మే 11న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించిన ఈమె ముంబైలో పెరిగింది. ఆదా శర్మ పదో తరగతి చదువుకునేటప్పుడే నటి కావాలని అనుకుంది. ఒక్కోసారి చదువు మానేసిన సినిమాల్లోకి వెళ్లాలని కూడా ట్రై చేసింది. కానీ తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో చదువును పూర్తి చేసింది. 2008లో ‘1920’ అనే హరర్ హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆదాశర్మకు పేరొచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు కూడా లభించింది.

    హిందీలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా ‘హార్ట్ ఎటాక్’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో సైడ్ పాత్రలు చేయడానికైనా ఒప్పుకుంది. సన్నాఫ్ సత్యమూర్తిలో ఈమె చిన్న పాత్రలో చూడొచ్చు. ఆ తరువాత అడవిశేషు తో ‘క్షణంతో కాస్త గుర్తింపు వచ్చింది.

    అయితే మిగతా హీరోయిన్లలాగా స్టార్ కాలేకపోయింది. అయినా వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోంచుకుంటూ ముందుకెళ్లింది. ఇటీవల ఆమె నటించిన ‘ది కేరళ స్టోరీ’ సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఆదా శర్మ మెయిన్ రోల్ చేశారు. ఈ సినిమా వివాదాల్లో కెక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఆదా శర్మ నటనపై పలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకేసారా స్టార్ డం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఆ చాన్స్ కోసం వెయిట్ చేయాలి. ఆదాశర్మ అలాగే వెయిట్ చేసి ఇప్పుుడు మంచి పొజిషన్లోకి వెళ్లారు.