ప్రతి వారికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. మన హీరోయిన్లకైతే కుక్కల పెంపకంపై మచ్చిక పెరిగిపోతోంది. వాటిని పెంచుతూ ఖాళీ సమయాల్లో ఆడుకుంటున్నారు. ఎప్పుడు షూటింగుల్లో సందడిగా ఉండే నాయికలు ఇంట్లో ఉన్నప్పుడు పెంపుడు కుక్కలతో సరదాగా ఉంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రకారం అవకాశాలు ఉన్నప్పుడే ఉపయోగించుకుని నాలుగు రాళ్లు సంపాదించుకునే క్రమంలో వారు కెరీర్ పైనే దృష్టి సారిస్తున్నారు. డబ్బు సంపాదించుకున్నాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అందాక మాత్రం వారు వెనుదిరిగి చూడడం లేదు.
ఇక ప్రస్తుతం కరోనా వైరస్ సమయం కావడంతో సినిమాలకు కాస్త విరామం దొరకడంతో హీరోయిన్లు వ్యాపకాలకు పని చెబుతున్నారు. సరదాలను తీర్చుకుంటూ సంతోషంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇంట్లో ఉన్న కుక్కలకు డ్రెస్ లు వేస్తూ వాటిని సింగారించి మరీ చూసుకుంటూ మురిసిపోతున్నారు. ప్రతి హీరోయిన్ ఓ కుక్కను పెంచుకుని దాంతో టైమ్ పాస్ చేసుకుంటూ పోతున్నారు.
ఇటీవల నటి సమంత తన పెంపుడు కుక్కతో వాలీబాల్ ఆడుతూ వీడియోలో పంచుకుంది. అది వైరల్ అయింది. ఇక కీర్తి సురేష్ ఏకంగా తన పెంపుడు కుక్కలకు మంచి డ్రెస్ లువేసి పెళ్లి కూతుళ్లలా తయారు చేసింది. రష్మిక ఏకంగా తనపెంపుడు కుక్కను ముద్దులు ఇస్తూ ఆ కుక్క ఇస్తే తీసుకుంటూ సందడి చేసింది. దీంతో పెంపుడు కుక్కలతో హీరోయిన్లు చేసే పనులు ముచ్చట గొలుపుతున్నాయి.
అనుష్క, పూజాహెగ్డే, రకుల్ ప్రీతిసింగ్, ప్రగ్యా, చార్మి, త్రిషలు కూడా ఖాళీ సమయాల్లో తమకు తోడుగా పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లందరు ఇలా కుక్కలతో సేదతీరుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని తమ సంకలో ఎత్తుకుంటూ వాటిని ముద్దాడుతూ కనిపిస్తున్నారు.