
డబ్బులు సంపాదించడానికి ఓ నటి చేసిన పని చూసి పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ ఫామ్ హౌస్ రెంట్ కు తీసుకొని.. టిక్కెట్లు పెట్టి మరీ రచ్చ చేసింది. రోజుల తరబడి సాగుతున్న ఈ బాగోతం.. పోలీసుల దృష్టికి చేరడంతో గుట్టు రట్టైంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ నటితోపాటు పార్టిసిపెంట్లను సైతం అరెస్టు చేశారు. ఇంతకీ.. ఆ వ్యవహారానికి పాల్పడిన నటి ఎవరు? ఈ రచ్చ ఎక్కడ సాగిందన్నది తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటి కవితశ్రీ డబ్బులు సంపాదించడానికి తప్పుడు మార్గం ఎంచుకుంది. చెన్నై సిటీలోని ఎల్ ఆర్ ఫార్మ్ రోడ్స్ జంక్షన్లోని ఈస్ట్ కోడ్ రోడ్డులోని ఈసీఆర్ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ ను కవితశ్రీ రెంటుకు తీసుకుంది. అయితే.. అందులో ఏం జరుగుతోందన్నది ఎవ్వరికీ తెలియదు. రాత్రి అయిన తర్వాత ఖరీదైన కార్లు వస్తున్నాయి.. ఆ తర్వాత వెళ్లిపోతున్నారు. మరికొందరు బైకులపై వచ్చి వెళ్తున్నారు. వారిలో కొందరు అమ్మాయిలు, ఆంటీలు, యువకులు ఉంటున్నారు.
కొన్ని రోజులుగా సాగుతున్న ఈ తంతు చూసి స్థానికులకు సందేహం వచ్చింది. ఇక్కడ ఏదో జరుగుతోందని వారు అనుమానించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న చెన్నై సిటీ పోలీసులు.. గుట్టు చప్పుడు కాకుండా ఫామ్ హౌస్ పై నిఘా వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కొక్కటిగా కార్లు వచ్చేశాయి. కాసేపటి తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
ఆ ఫామ్ హౌస్ లోపల 16 మంది మగాళ్లు, 14 మంది లేడీస్ ఫుల్లుగా మద్యం తాగి పోర్న్ డ్యాన్సులు చేస్తున్నారట. ఇది చూసి అవాక్కైపోవడం పోలీసుల వంతైంది. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్నవారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందరినీ అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
సినిమా నటి కవితశ్రీ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తోందని తేలిందట. రోజుకు రూ.15 వేలు అద్దె చెల్లిస్తూ ఆ ఫామ్ హౌస్ లో దందా కొనసాగిస్తోందట. టిక్కెట్ పెట్టి మరీ ప్యాసింజర్లను లోనికి అనుమతిస్తున్నారట. మగాళ్లకు ఒక్కొక్కరికి రూ.2 వేల వరకు వసూలు చేసి ఈ పోర్న్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. కస్టమర్ల నుంచి గూగుల్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. దీంతో.. ఈ వ్యవహారం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.