
దీపక్ చాహర్ ను ముందు పంపించాలన్న నిర్ణయం కోచ్ రాహుల్ ద్రవిడ్ దేనని టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో అతడా స్థానానికి న్యాయం చేశాడని ప్రశంచించాడు. చివరి బంతి వరకు ఆడాలన్నది మా లక్ష్యం. అందుకే సుదీర్ఘంగా బ్యాంటింగ్ చేశాం. దీపక్ అద్భుతంగా ఆడాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లో భారత్ -ఏ తరఫున అతడు పరుగులు చేశాడు. దీపక్ ను ముందుగా పంపించడం కఠినమైంది కాకున్నా మంచి నిర్ణయమే అని భువీ అన్నాడు.