https://oktelugu.com/

Actress Varalakshmi : నటి వరలక్ష్మికి బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో నోటీసులు, ఆల్రెడీ పీఏ అరెస్ట్!

అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో వరలక్ష్మీ ఎన్సీబీ అధికారుల విచారణలో పాల్గొననున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్ ని ఊపేస్తోంది. గతంలో పలువురు హీరోయిన్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2023 / 09:22 PM IST
    Follow us on

    Actress Varalakshmi : నటి వరలక్ష్మీ శరత్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్ కేసులో కొచ్చి అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. ఆల్రెడీ వరలక్ష్మీ శరత్ కుమార్ పీఏని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాలా కాలంగా ఆదిలింగం అనే వ్యక్తి వరలక్ష్మీ శరత్ కుమార్ వద్ద పీఏగా పని చేస్తున్నాడు. అతడికి ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదిలింగం పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

    డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆదిలింగం సినిమా పరిశ్రమలో పెట్టుబడి పెడుతున్నాడు. ఆదిలింగం డ్రగ్స్ వ్యాపారంలో నటి వరలక్ష్మీకి కూడా భాగస్వామ్యం ఉందని అధికారుల సమాచారం. ఆదిలింగం నుండి వరలక్ష్మీ డ్రగ్స్ సైతం తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును చిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ విషయంలో వరలక్ష్మీ అతనికి సహకరిస్తుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

    అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో వరలక్ష్మీ ఎన్సీబీ అధికారుల విచారణలో పాల్గొననున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్ ని ఊపేస్తోంది. గతంలో పలువురు హీరోయిన్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. కన్నడ పరిశ్రమకు చెందిన రాగిణి ద్వివేది, సంజనా గల్రాని డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు.

    దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురైన వరలక్ష్మీ మొదట్లో హీరోయిన్ గా చేశారు. ప్రస్తుతం ఆమె విలన్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి చిత్రాల్లో వరలక్ష్మీ నటన హైలెట్ గా ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఆమె బిజీగా ఉన్నారు.