APTA : ఆప్త వేడుకకు ముస్తాబైన అట్లాంటా

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 1 నుండి 3 వరకు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్త) 2023 జాతీయ సమావేశాలు

Written By: NARESH, Updated On : August 29, 2023 9:32 pm

APTA meetings

Follow us on

-సెప్టెంబర్ 1 నుండి 3 వరకు 15 వసంతాల పండుగ

-తెలుగు రాష్ట్రాల నుండి హాజరవుతున్న ప్రముఖులు

APTA : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్త) 2023 జాతీయ సమావేశాలు సెప్టెంబర్ 1 నుండి 3 వరకు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహిస్తున్నట్లు ఆప్త అధ్యక్షులు కొట్టె ఉదయ్ బాస్కర్ తెలిపారు.. ఆప్త ఏర్పడి 15 సంవత్సరాలైన సందర్బంగా 15 వసంతాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేసారు…

అట్లాంటా నగరంలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ నందు మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాలకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆప్తులను కన్వెన్షన్ కన్వినర్ విజయ్ గుడిసేవ ఆహ్వానించారు.. ఆప్త ఆహ్వానం మేరకు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు ఆప్త సభలకు హాజరుకానున్నట్లు తెలిపారు..

2008వ సంవత్సరంలో కొద్ది మంది తో మొదలైన ఆప్త లో నేడు 7 వేల మంది సభ్యులయ్యారు… తమకు జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్దికి తోడ్పాటు అందించాలనే దృక్పథంతో ప్రతి ఏటా విద్య, వైద్యం, ఉపాధి లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది ఆప్త… విద్యకు పేదరికం అడ్డుకాకూడదని కోట్లాదిరూపాయలను విద్యార్దినీ విద్యార్దులకు ఉపకార వేతనాలను అందించడంలో ఆఫ్తకు సాటిలేరెవ్వరు.. ప్రతి ఏటా తమ అసోషియేషన్ వార్షిక సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీ.. అందులో బాగంగానే ఈ ఏడాది 15 వ వసంతాల పండుగను ఘనంగా నిర్వహిస్తోంది.. మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఆప్త ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు , భవిష్యత్ లో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు.. అతిధుల ప్రసంగాలు , గౌరవ సత్కారాలు ఉంటాయని పేర్కొన్నారు..

ఆప్త 15 వసంతాల సంబరాలను విజయవంతం చేసేందుకు ఆప్త సభ్యులతో ఆహ్వాన కమిటీ, ట్రాన్సుపోర్టు అండ్ ఎరేంజ్ మెంట్సు , పుడ్ , సాంస్కృతిక , వెన్యూ , మీడియా కమిటిలను ఏర్పాటు చేసారు..