Scam : మన డాక్టర్.. అమెరికాలో 500K డాలర్ల స్కామ్ చేశాడు..

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), SBA ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ , HHS ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు జరిపిన సమగ్ర విచారణలో ఈ స్కాం వెలుగుచూసింది. మన డాక్టర్ చేసిన ఈ అనధికార వ్యయాలు వెలుగులోకి వచ్చాయి.

Written By: NARESH, Updated On : August 29, 2023 9:17 pm
Follow us on

Scam : యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాలో ఉన్న 46 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన దంతవైద్యుడు డాక్టర్ రంజన్ రాజ్‌బన్షి పెద్ద స్కామ్ చేశాడు. ఇటీవల రెండేళ్ల వ్యవధిలో COVID-19 సహాయ నిధులలో $500,000 డాలర్లను దొంగిలించాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించారు.

స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) , US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) ద్వారా మొత్తం $850,000కి పైగా రిలీఫ్ ఫండ్‌లు కరోనా మహమ్మారికి సంబంధించిన నిర్దిష్ట వ్యాపార ప్రయోజనాల కోసం కేటాయించబడ్డాయి. అయితే ఈ నిధులను ఉద్దేశించిన విధంగా ఉపయోగించకుండా డాక్టర్ రాజ్‌బన్షి వ్యక్తిగత ఖర్చులు, పెట్టుబడుల కోసం $500,000 మళ్లించారు.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), SBA ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ , HHS ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు జరిపిన సమగ్ర విచారణలో ఈ స్కాం వెలుగుచూసింది. మన డాక్టర్ చేసిన ఈ అనధికార వ్యయాలు వెలుగులోకి వచ్చాయి.

డా. రాజ్‌బన్షి తన శిక్షకు ముందు దొంగిలించబడిన నిధులను తిరిగి చెల్లించడానికి అంగీకరించాడు. నేరం రుజువైతే అతను గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష , $250,000 వరకు జరిమానాను ఎదుర్కొంటాడు. డిసెంబర్ 4న శిక్ష ఖరారు కానుంది.